AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’..

సినిమా పరిశ్రమలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో కరీనాకపూర్‌, అర్జున్‌ కపూర్‌, రియా కపూర్‌, టాలీవుడ్‌లో మంచు మనోజ్‌ కుమార్‌, తమిళ చిత్ర

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి 'మనోహరి'..
Basha Shek
|

Updated on: Dec 31, 2021 | 7:21 AM

Share

సినిమా పరిశ్రమలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో కరీనాకపూర్‌, అర్జున్‌ కపూర్‌, రియా కపూర్‌, టాలీవుడ్‌లో మంచు మనోజ్‌ కుమార్‌, తమిళ చిత్ర పరిశ్రమలో కమలహాసన్‌, అర్జున్‌, వడివేలు కరోనా బాధితుల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్‌ అందాల తార.. బాహుబలి బ్యూటీ ‘ నోరా ఫతేహి’ కొవిడ్‌ బారిన పడింది. సోషల్ మీడియా ద్వారా ఆమే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నాను. నిజం చెప్పాలంటే ఈ వైరస్‌ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపిస్తుంది. అలా నాపై కూడా బాగా ఎఫెక్ట్‌ చూపింది . కరోనా ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను వైరస్‌పై విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా.. సురక్షితంగా ఉండండి’ అని ఫ్యాన్స్‌కు సూచించింది నోరా ఫతేహి.

బాహుబలి ‘మనోహరి’ బాలీవుడ్‌ లో స్పెషల్‌ సాంగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమా ‘ఇట్టాగే రెచ్చిపోనా’ అంటూ మొదటిసారి టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిందీ అందాల తార. ఆ తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకుంది. ‘కిక్‌2’, ‘షేర్‌’ ‘లోఫర్‌’, ‘ఊపిరి’ సినిమాల్లోని పాటలకు కూడా అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అలరించింది. పలు టీవీ షోలు, డ్యాన్స్‌ రియాలిటీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ ఆమెకు అశేష అభిమానగణం ఉంది. నిత్యం తను షేర్‌ చేసే గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలకు లక్షలాది లైకులు, కామెంట్లు వస్తుంటాయి.

Also Read:

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..

Kalyani Priyadarshan: క్యూట్ బ్యూటీ ‘కళ్యాణి ప్రియదర్శన్’ ఆకట్టుకుంటున్న లేటేస్ట్ ఫోటోస్..

Lakshmi Manchu: చీరకట్టు అందాలతో కవ్విస్తున్న మోడరన్ మహాలక్షి ‘మంచు లక్ష్మి’.. (ఫొటోస్)