మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.