AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మహేష్ బాబు కోసం మరోసారి ఆ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్న జక్కన్న

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Mahesh Babu : మహేష్ బాబు కోసం మరోసారి ఆ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్న జక్కన్న
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2022 | 6:31 AM

Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , మొదటి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ తో కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్.

అతడు ఖలేజా సినిమాలతర్వాత ఈ కంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. ఎప్పటినుంచో ఈ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆవార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుందని అంటున్నారు. జక్కన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న అలియా భట్ మహేష్‌తో జతకట్టబోతుందని గుసగుస వినిపిస్తుంది.  ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ స్టోరీ అని తెలుస్తోంది. ఎలాంటి సెట్స్ లేకుండా రియల్ లోకేషన్స్ లోనే షూటింగ్ అంతా పూర్తిచేస్తారని అంటున్నారు. మరి మహేష్ కోసం మరోసారి అలియాను నిజంగా దింపుతున్నారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ జీవోపై స్పందించిన చిరంజీవి.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్..

AP Movie Ticket Price: సినిమా టికెట్ల రేట్స్ నిర్ణయించిన ఏపీ సర్కార్.. ధరల వివరాలు ఇక్కడ చూడండి..

రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం గుడ్‏న్యూస్.. సినిమా టికెట్స్ రేట్స్ జీవో జారీ..