AP Movie Ticket Price: సినిమా టికెట్ల రేట్స్ నిర్ణయించిన ఏపీ సర్కార్.. ధరల వివరాలు ఇక్కడ చూడండి..
AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు..
AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం రూ. 20, గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు నాలుగు కేటగిరీలుగా విభజించగా.. వాటిలో నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా పేర్కొంది. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లోని కీలక పాయింట్స్ ఇవే..
-
- నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లుగా సినిమా రేట్లు నిర్దారణ.
- ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు నాలుగు కేటగిరీలుగా విభజన.
- కనీసం 20, గరిష్టంగా 250 గా రేట్ల నిర్దారణ.
- నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్లు.
- ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే రకాల టిక్కెట్లు.
- ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ.
- ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశాలు.
- కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100.
- కార్పొరేషన్లలో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60.
- కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.125.
- కార్పొరేషన్ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.150, రూ. 250.
- మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80.
- మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50.
- మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ.100.
- మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.125, రూ. 250.
- నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70.
- నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40.
- నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90.
- నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.100, రూ. 250.
- ఈ రేట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేసుకునే ఛాన్స్.
- హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెన్యూమరేషన్ కాకుండా 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది.
- కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజులు రేట్లు పెంచుకునె అవకాశం.
- రోజు ఐదు షోలు వేసుకునే అవకాశం, తప్పనిసరిగా ఒక షో చిన్న సినిమా వేయాలని ఆదేశం.
Also read:
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో బిగ్ ఆఫర్స్.. ఎప్పటి నుంచి అంటే..!
Viral Video: పెళ్లి పీఠలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకలా చేశారో తెలిస్తే అవాక్కవుతారు..!
Russia Ukraine Crisis: మా మాట వింటే.. తక్షణమే యుద్ధం ఆపేస్తాం.. రష్యా సంచలన ప్రకటన