Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ జీవోపై స్పందించిన చిరంజీవి.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్..

ఏపీలో సినీ ప్రియులకు ప్రభుత్వం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. సినిమా టికెట్స్ రేట్లు సవరిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi:  టికెట్స్ రేట్స్ జీవోపై స్పందించిన చిరంజీవి.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్..
Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2022 | 9:29 PM

ఏపీలో సినీ ప్రియులకు ప్రభుత్వం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. సినిమా టికెట్స్ రేట్లు సవరిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం రూ. 20, గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు నాలుగు కేటగిరీలుగా విభజించగా.. వాటిలో నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా పేర్కొంది. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని.. థియేటర్ల మనుగడకు.. ప్రజల వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త జీవో జారీ చేసినందకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

” తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా.. అటు థియేటర్ల మనుగడను.. ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికేట్స్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి. పరిశ్రమ తరపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు.. పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు ” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ట్వీట్..

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..