సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలపై ఈరోజు రాత్రి లేదా.. రేపు సినిమా టికెట్స్

Rajitha Chanti

|

Mar 07, 2022 | 5:17 PM

సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలపై ఈరోజు రాత్రి లేదా.. రేపు సినిమా టికెట్స్ జీవో జారీ చేసే అవకాశం ఉందని తెలిపింది. గత కొద్ది రోజులుగా సినిమా టికెట్స్ ధరలపై సినీ ప్రముఖులకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు.. డిస్టిబ్యూటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రభాస్.. ఎస్ఎస్ రాజమౌళి, పోసాని వంటి ప్రముఖులు ఏపీ సీఎం జగన్‏తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని..త్వరలోనే సినిమా టికెట్స్ రేట్స్ పై జీవో జారీ చేయనున్నారని తెలిపారు.

ఇక తాజాగా రాధేశ్యామ్ విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందే ప్రభుత్వం జీవో జారీ చేస్తే సంతోషిస్తానంటూ తెలిపారు. ఇక తాజాగా ఈరోజు రాత్రి లేదా… రేపు సినిమా టికెట్ ధరలపై జీవో జారీ చేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక కొత్తగా జారీ చేసే జీవో ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి జరగనుందో లేదో చూడాలి. గ్రామీణ ప్రాంతాలలోని థియేటర్లకు ఊరటనిచ్చే విధంగా ఈ కొత్త ధరలు ఉండనున్నాయట. ఇదే కనుక నిజమైతే.. త్వరలో విడుదలయ్యే సినిమాలకు లాభం కలగడం ఖాయంగా అనిపిస్తోంది.

Also Read: Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హ‌బిబో పాట‌కు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్

Prabhas: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?

Krithi Shetty: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?

Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన కుర్ర హీరో.. ఆడాళ్లూ మీకు జోహార్లుతో ఆకట్టుకున్న శర్వా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu