AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హ‌బిబో పాట‌కు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్

Keerthy Suresh: కళకు భాషతో పనిలేదు.. మనసుని హత్తుకునే భావం ఉంటె చాలు.. సంగీతానికి కూడా అంతే.. చెవులకు ఇంపుగా.. ఉండి.. ఆ సాంగ్ మనసుని స్పందింపజేస్తే చాలని.. కచ్చా బాదాం సాంగ్(Kacha Badam Song), పుష్పా..

Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హ‌బిబో పాట‌కు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్
Keerthy Suresh Habibo Dance
Surya Kala
|

Updated on: Mar 07, 2022 | 10:48 AM

Share

Keerthy Suresh: కళకు భాషతో పనిలేదు.. మనసుని హత్తుకునే భావం ఉంటె చాలు.. సంగీతానికి కూడా అంతే.. చెవులకు ఇంపుగా.. ఉండి.. ఆ సాంగ్ మనసుని స్పందింపజేస్తే చాలని.. కచ్చా బాదాం సాంగ్(Kacha Badam Song), పుష్పా (Pushpa Movie) లోని సాంగ్స్ వంటి అనేక పాటలు రుజువు చేశాయి. తాజాగా ఈ క్రేజీ సాంగ్స్ లిస్ట్ లో కోలీవుడ్ సాంగ్స్(Kollywood Songs) కూడా చేరింది. “హ‌ల‌మితి హ‌బిబో” పాటకు సినీ సెలబ్రెటీలతో పాటు, సామాన్యులు కూడా ఫిదా అయ్యారు. రీల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కేరళ కుట్టి.. మహానటి కీర్తి సురేష్ కూడా హ‌ల‌మితి హ‌బిబో సాంగ్ కు ఓ రేంజ్ లో స్టెప్స్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్, పూజాహెగ్డే లు హీరో హీరోయిన్లుగా నెల్స‌న్ దిలీప్ కుమార్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ” బీస్ట్”. ఈ సినిమాకిఅనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలోని హ‌ల‌మితి హ‌బిబో సాంగ్ కు.. సంగీత ప్రేమికులు ఫిదా. డ్యాన్సింగ్ లవర్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఈ పాటకు రీల్స్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు పాటకు మరో హీరోయిన్ స్టెప్స్ వేసింది. కీర్తిసురేష్.. . హిట్ ట్రాక్‌కు ది రూట్‌..టాలెంట్ మేనేజర్ అక్షిత సుబ్ర‌మ‌ణియ‌న్ తో క‌లిసి స్టెప్స్ వేసింది. పంజాబీ డ్రెస్ లో కేరళ కుట్టి.. అక్షితతో చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

 ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే లైంగిక వేధింపుల కేసులతో డైరెక్టర్ అరెస్ట్.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?