Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్తో
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్తో కూడిన పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ దర్శకులతో సలార్, స్పిరిట్, ఆదిపురుష్.. ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు. అలాగే.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రాధేశ్యా్మ్ చిత్రయూనిట్ విలేకర్లతో ముచ్చటించింది.
పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న రాధేశ్యామ్‌పై తెలుగురాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మూవీ టికెట్ ధరలపై ఇవాళ జరిగిన ప్రెస్ మీట్‌లో హీరో ప్రభాస్ స్పందించారు. రాధేశ్యామ్ విడుదలకు ముందే టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే చాలా సంతోషిస్తానని ప్రభాస్ చెప్పారు. గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మధ్య సినిమా టికెట్స్ ధరల విషయంలో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు.. ప్రభాస్.. ఎస్ఎస్ రాజమౌళి.. పోసాని, ఆర్ నారయణ మూర్తి ఏపీ సీఎం జగన్తో సమావేశమయ్యారు. అనంతరం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. తర్వలోనే సమస్యలు పరిష్కారం కానున్నట్లుగా తెలిపారు.
Also Read: Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హబిబో పాటకు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్
Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?
Krithi Shetty: లక్కీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?
Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన కుర్ర హీరో.. ఆడాళ్లూ మీకు జోహార్లుతో ఆకట్టుకున్న శర్వా..