Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

అక్కినేని అఖిల్ (Akhil Akkineni).. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన

Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..
Agent
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2022 | 5:36 PM

అక్కినేని అఖిల్ (Akhil Akkineni).. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అఖిల్ కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఇచ్చిన కిక్‏తో అఖిల్.. యాక్షన్ ఎంటర్‏టైనర్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ఏజెంట్ అని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇందులో అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేశాడు.. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకోనున్నాడు అఖిల్. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఏజెంట్ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అయితే ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించబోతున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమా నుంచి మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఆయన పోస్టర్ షేర్ చేస్తూ.. క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ సినిమాలో భాగమయ్యారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్న మమ్ముట్టి భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ‘ది డెవిల్ క్రూరమైన రక్షకుడు’ అని మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం పట్ల మమ్ముట్టి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Also Read: Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హ‌బిబో పాట‌కు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్

Prabhas: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?

Krithi Shetty: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?

Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన కుర్ర హీరో.. ఆడాళ్లూ మీకు జోహార్లుతో ఆకట్టుకున్న శర్వా..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..