Sunny Leone : మంచు హీరోతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సన్నీలియోన్..
నటిగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది శృంగార తార సన్నీ లియోని. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది.

Sunny Leone : నటిగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది శృంగార తార సన్నీలియోన్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సన్నీ.. ఆతర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. అయితే హీరోయిన్ గా నటిస్తూనే.. మరో వైపు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది ఈ వయ్యారి భామ. తెలుగులో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమాలో డియో.. డియో అంటూ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది సన్నీ.. ఆతర్వాత మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఈ సినిమాలతర్వాత పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇప్పుడు తిరిగి తెలుగులో బిజీకావాలని చూస్తుంది. ఈ క్రమంలోనే మంచు హీరో సినిమాతో తెలుగులోని రీ ఎంట్రీ ఇస్తుంది సన్నీ.
చాలా కాలంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న మంచు విష్ణు ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నారు. ఈ క్రంమలోనే ఈషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఓ మూవీలో నటిస్తున్నారు విష్ణు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు మంచు విష్ణు. ఇటీవలే ఐటి కుంభకోణం నేపథ్యంలో మంచు విష్ణు చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రేజీ లేడీ సన్నీ లియోన్ రేణుక అనే పాత్రలో నటించనుందని తెలిసింది. తాజాగా సన్నీ లియోన్ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా స్పష్టం చేసింది. ఈ రోజు మరో జర్నీని మంచు విష్ణుతో కలిసి ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్ వుంది` అంటూ రాసుకొచ్చారు సన్నీ.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :




