రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం గుడ్‏న్యూస్.. సినిమా టికెట్స్ రేట్స్ జీవో జారీ..

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది.

రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం గుడ్‏న్యూస్.. సినిమా టికెట్స్ రేట్స్ జీవో జారీ..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2022 | 8:12 PM

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20,గరిష్టంగా 250 గా రేట్ల నిర్దారించింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల  టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేసింది.

ఒక్కో థియేటర్ లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం,నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ జరిగింది. అంటే.. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా సినిమా టికెట్స్ రేట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు.. డిస్టిబ్యూటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై క్లారిటీ రాకముందే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తగ్గించిన టికెట్ రేట్ల మధ్యే విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్, నారాయణమూర్తి, కొరటాల శివలు సీఎం జగన్‌ను కలిశారు. టిక్కెట్ల ధరల విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని కోరారు. భేటీ అనంతరం గుడ్‌ న్యూస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్‌.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంలో జీవో జారీ కావడంతో సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక రాధేశ్యామ్‌ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హీరో ప్రభాస్‌ మూవీని ప్రమోట్‌ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. జీవో జారీ తరువాయితో ట్రిపులార్‌, ఆచార్య టీమ్స్‌ కూడా ప్రచార కార్యక్రమాలను స్పీడప్ చేయాలని భావిస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాయి.

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..