Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో స్పెషల్ అప్టేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఆ నిర్ణయం..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో స్పెషల్ అప్టేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఆ నిర్ణయం..
Radhe Shyam
Follow us

|

Updated on: Mar 07, 2022 | 6:29 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమమానుల కోసం  ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసే పనిలో పడ్డారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన NFT లాంఛింగ్ జరగనుంది. ఈ కలెక్షన్‌లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా ఉండబోతున్నాయి. సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో ఉండబోతున్నాయి. వాటిని కొనుక్కోడానికి అభిమానులకు మార్చ్ 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

అభిమానులకు సినిమా విడుదలకు ముందు ఇంతకంటే పెద్ద బహుమతి మరోటి ఉండదేమో..? ప్రభాస్ లెగసీ కంటిన్యూ చేయడానికి అభిమానులకు డిజిటల్ సేకరణలకు ఇది మంచి అవకాశంగా నిలిచింది. ఈ డిజిటల్ కలెక్షన్‌లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా ప్రభాస్‌ను కలిసే అవకాశం కూడా అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు యిష్టమైన స్టార్‌ను కలిసే అవకాశం మరింత ఎక్కువగా ఉండబోతుంది. అభిమానులు డబ్బుల రూపంలోనే వీటిని కొనుగోలు చేయొచ్చు. క్రిప్టో కరెన్సీతో దీనికి పని లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఇటలీలోని అద్భుతమైన విజువల్స్.. అత్యద్భుతమైన మేకింగ్.. స్పెషల్ ఎఫెక్ట్స్.. హైదరాబాద్, జార్జియాలో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. టి సిరీస్, గుల్షన్ కుమార్ సమర్పిస్తున్న రాధే శ్యామ్ సినిమాను యువీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మార్చ్ 11న సినిమా విడుదల కానుంది.

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో