Akkineni Akhil: నాగచైతన్యతో అఖిల్ సినిమా ?.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అక్కినేని హీరో..
యాక్షన్ థ్రిల్లింగ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని.. అందరి అంచనాలను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది చిత్రయూనిట్. ఇక నిన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే తన అన్నయ్య నాగచైతన్యతో సినిమా చేయడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తు్న్న లేటేస్ట్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈనెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. యాక్షన్ థ్రిల్లింగ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని.. అందరి అంచనాలను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది చిత్రయూనిట్. ఇక నిన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే తన అన్నయ్య నాగచైతన్యతో సినిమా చేయడం పై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏజెంట్ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్… టెక్నీషియన్ చాలా కష్టపడ్డారని.. అలాగే మూవీ అక్కినేని అభిమానులతోపాటు.. ఆడియన్స్ అందరి అంచనాలు అందుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. అలాగే తన అన్నయ్య చైతూతో సినిమా చేయడంపై అఖిల్ మాట్లాడుతూ.. మంచి స్క్రిప్ట్ దొరికితే తనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు. స్పై ఏజెంట్ పాత్ర కోసం ఎంతో కష్టపడక తప్పలేదని.. కొన్ని సందర్భాల్లో మానసికంగా.. శారీరకంగా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని.. సినిమా మీద ఇష్టంతో ఆ కష్టాన్ని కూడా మర్చిపోయి చేసానని అన్నారు. తనతోపాటు.. టీమ్ మొత్తం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందనే నమ్మకం ఉన్నట్లు తెలిపారు.




స్పై యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఏకే ఎంటర్టై్న్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మించారు.




