AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమా రా బాబు..! రాడ్డు రంబోలా..!! రూ. 210కోట్లు పెడితే రూ. 50కోట్లు కూడా రాబట్టలేదు..

ప్రతి శుక్రవారం థియటర్స్ లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒక వైపు ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. థియటర్స్‌లో కొత్త కొత్త సినిమాలు విడుదలై ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఏం సినిమా రా బాబు..! రాడ్డు రంబోలా..!! రూ. 210కోట్లు పెడితే రూ. 50కోట్లు కూడా రాబట్టలేదు..
Movie
Rajeev Rayala
|

Updated on: Sep 09, 2025 | 10:06 AM

Share

థియేటర్స్ లో సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో.. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా సినిమాలు విడుదులై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి వెయ్యికోట్ల వరకు వసూల్ చేస్తున్నాయి.. అలాగే చిన్న సినిమాలు అంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా భారీ హిట్ అందుకొని కలెక్షన్స్ లో దుమ్మురేపుతున్నాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి పది కోట్లు కూడా రాబట్టని సినిమాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓ చెత్త సినిమా.. ఇండియాలోనే డిజాస్టర్ సినిమాల్లో ఈ సినిమా ఒకటి. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా పరమ చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రూ.210 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే తిప్పి కొడితే రూ.50 కోట్ల కూడా రాలేదు.. సినిమాకు భారీ ప్రమోషన్స్ చేశారు, స్టార్ హీరో నటించాడు.. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఎదో కాదు అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా. ఈ సినిమా కోసం మూవీ టీమ్ 5ఏళ్లు కష్టపడ్డారు.

ఇది కూడా చదవండి :మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించాడు. మైదాన్ సినిమా కోసం చిత్రయూనిట్ చాలా కష్టపడ్డారు. కోవిడ్ లాక్‌డౌన్, తుఫాను వల్ల దెబ్బతిన్న సెట్.. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ అయ్యింది. మొత్తంగా రూ. 210కోట్లు పెట్టి సినిమా తీస్తే.. కనీసం రూ. 50కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమాను ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముందుగా ఈ సినిమాను 120కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఫైనల్ గా రూ.210కోట్లు అయ్యింది. షేర్ లెక్కల చూసుకుంటే పట్టుమని రూ.50 కోట్లు కూడా రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.