AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన మహేష్ హీరోయిన్..ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుందంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన మహేష్ హీరోయిన్..ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుందంటే
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2025 | 6:21 PM

Share

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు కళ్ల కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి ఈ సినిమాను పాన్ గ్లోబల్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు బడీ పెంచారు. మహేష్ బల్కీ లుక్ లో అదిరిపోయాడు. అలాగే పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సింహంలా ఉన్నాడు మహేష్. మహేష్ లుక్‌కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమాల్లో అభిమానులను మెప్పించిన సినిమా అతిథి మూవీ ఒకటి. యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

పోకిరి లాంటి సంచలన విజయం తర్వాత మహేష్ సైనికుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. ఆతర్వాత అతిథి మూవీ వచ్చింది. అతిథి సినిమాలో మహేష్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. లాంగ్  హెయిర్ లో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. అతిథి మూవీ కథ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ

కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన, యాక్షన్ సీన్స్, అలాగే మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ నటించింది. ఆ అమ్మడి పేరు అమృత రావు. మోడలింగ్ నుంచి నటనలోకి వచ్చింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించిన వివాహ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది అమృత. ఎక్కువుగా హిందీలోనే నటించింది ఈ బ్యూటీ. తెలుగులో ఈ భామ అతిథి సినిమా ఒక్కటే చేసింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా ఈ భామ 2018లో వచ్చిన సంజు సినిమాలో నటించింది ఆతర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ చిన్నది. అమృత అన్మోల్ అనే రేడియో జాకీతో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ..  7 సవంత్సరాలు ప్రేమించుకుని 15th మే 2013 న ముంబాయిలో వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?
రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?