AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atlee Kumar: జవాన్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో అట్లీ.. నెక్ట్స్‌ ప్రాజెక్టు కోసం హాలీవుడ్‌ స్టూడియోతో చర్చలు

రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌ భారీ బడ్జెట్‌తో జవాన్‌ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. సెప్టెంబర్‌ 7న విడుదలైన జవాన్‌ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా జవాన్‌ సినిమాతో దర్శకుడు అట్లీ క్ఏజ్‌ కూడా నెక్ట్స్‌ లెవెల్‌ కు వెళ్లింది. జవాన్‌ కు ముందు కేవలం తమిళంలో బిజీగా ఉన్న అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ బిజీబిజీ అయ్యాడు.

Atlee Kumar: జవాన్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో అట్లీ.. నెక్ట్స్‌ ప్రాజెక్టు కోసం హాలీవుడ్‌ స్టూడియోతో చర్చలు
Atlee Kumar, Shah Rukh Khan
Basha Shek
|

Updated on: Oct 07, 2023 | 7:12 AM

Share

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తమిళ యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నయనతార హీరోయిన్‌గా నటించింది. అలాగే దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌ భారీ బడ్జెట్‌తో జవాన్‌ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. సెప్టెంబర్‌ 7న విడుదలైన జవాన్‌ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా జవాన్‌ సినిమాతో దర్శకుడు అట్లీ క్ఏజ్‌ కూడా నెక్ట్స్‌ లెవెల్‌ కు వెళ్లింది. జవాన్‌ కు ముందు కేవలం తమిళంలో బిజీగా ఉన్న అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ బిజీబిజీ అయ్యాడు. అయితే అట్లీ మాత్రం హాలీవుడ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం . తన తర్వాతి ప్రాజెక్టు కోసం ప్రఖ్యాత హాలీవుడ్‌ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

కాగా భారతీయ సినిమాల్లో నటించి ఆ తర్వాత హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే దర్శకులు మాత్రం ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి అరుదైన ఫీట్ చేసేందుకు అట్లీ సిద్ధమయ్యాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘సినిమాకు దేశం, ప్రాంతం అనే తారతమ్యాలు లేవు. ఈ సందర్భంగానేను ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. గతంలో దక్షిణాది సినిమాలను ‘సౌత్ మసాలా’ అనేవారు. అది ఏమిటో నాకు తెలియదు. నేను బాలీవుడ్‌లో కూడా చేసింది ఇదే. ఏది మంచి, చెడు అనేది ప్రేక్షకులకు తెలుసుహాలీవుడ్‌లో కూడా సినిమాలకు ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవు. రెండు రోజుల క్రితం హాలీవుడ్ స్టూడియోతో మాట్లాడాను. ఆయన నన్ను దర్శకుడిగా మాత్రమే గుర్తించారు. నేనెప్పుడూ తమిళ చిత్ర దర్శకుడిగా ఆలోచించలేదు. త్వరలోనే హాలీవుడ్ సినిమా చేస్తాం’ అని అట్లీ చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా తనకు హాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయని అట్లీ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

భార్య తో జవాన్ డైరెక్టర్ అట్లీ ..

View this post on Instagram

A post shared by Atlee (@atlee47)

1100 కోట్లను దాటేసిన జవాన్ కలెక్షన్స్..

View this post on Instagram

A post shared by Atlee (@atlee47)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి