Leo Movie: ‘విజయ్, లోకేశ్ కనగరాజ్‌ల మధ్య విభేదాలు’.. స్పందించిన నిర్మాత.. వారు అన్నదమ్ముల్లా ఉంటారంటూ..
తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి నటించి ది మోస్ట్ అవెటైడె్ మూవీ ' లియో ' చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పలు కారణాల వల్ల ఈ సినిమా ప్రమోషన్ వర్క్ నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో హీరో విజయ్‌కి, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి నటించి ది మోస్ట్ అవెటైడె్ మూవీ ‘ లియో ‘ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పలు కారణాల వల్ల ఈ సినిమా ప్రమోషన్ వర్క్ నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో హీరో విజయ్‌కి, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్, విజయ్ మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ కారణంగానే లోకేష్ కనగరాజ్ తన సినిమాను ప్రమోట్ చేయడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై స్పందించిన చిత్ర నిర్మాత లలిత్ కుమార్.. ‘విజయ్, లోకేష్ కనగరాజ్ అనే తేడా లేదు. ఇద్దరూ అన్నదమ్ముల్లా ఎంతో సన్నిహితంగా ఉంటారు’ అని చెప్పడంతో విజయ్, లోకేష్ అభిమానుల్లో కాస్త ఊరట కలిగింది.
రాజకీయ కారణాలతోనే నో పర్మిషన్..
కాగా ‘లియో’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి చెన్నై పోలీసులు అంగీకరించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు. అయితే రాజకీయ కారణాలతో విజయ్ సినిమా కార్యక్రమానికి అధికార ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ గా మారే అవకాశం ఉన్న విజయ్ ను దెబ్బతీసేందుకు ఈ ప్రోగ్రామ్ కు అవకాశం లేకుండా చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు ట్రైలర్ రిలీజ్, ఆడియో లాంచ్ తదితర కార్యక్రమాల్లో తప్ప మరే ఇతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విజయ్ పాల్గొనడం లేదు. ఏ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా క్యాన్సిల్ కావడంతో సినిమా ప్రమోషన్ కు బ్రేక్ పడింది.
విజయ్ తో త్రిష..
View this post on Instagram
అడ్వాన్స్ బుకింగ్‌లో జోరు..
ప్రమోషన్లు జరుగుతున్నప్పటికీ, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్‌తో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. . ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. అర్జున్ సర్జా కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
త్రిష లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.