AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun- Sreeleela: ‘టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీగా ఉంది’.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై శ్రీలీల

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్ట్ అయ్యారు. ఇది అతని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులను ఆందోళనకు గురిచేసింది. తాజాగా ఈ విషయంపై శ్రీలీల స్పందించింది.

Allu Arjun- Sreeleela: 'టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీగా ఉంది'.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై శ్రీలీల
Allu Arjun, Sreeleela
Basha Shek
|

Updated on: Dec 14, 2024 | 5:07 PM

Share

అల్లు అర్జున్ అరెస్టుపై కిక్సిక్ బ్యూటీ శ్రీలీల స్పందించారు. శనివారం (డిసెంబర్ 14) విశాఖ పట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు. ‘పుష్ప 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. హైదరాబాద్ లో తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరం. అల్లు అర్జున్ అరెస్టుతో అందరూ టెన్షన్ పడ్డాం. అయితే ఆయన జైల్ నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది శ్రీలీల. కాగా విశాఖలోని డాబాగార్డెన్స్ లో ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్, విష్ణు కుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు. ‘కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నయ్ షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి. 24వ స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ ప్రారంభం అవుతుంది’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు. వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్పులేసింది కిస్సిక్ బ్యూటీ.

కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసంది. కిస్సిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డ్యాన్స్ చేసింది. తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది.  పుష్ప 2 సినిమా సక్సెస్ లో కిస్సిక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో శ్రీలీల..

శ్రీలీల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.