AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: కంగువ ఎఫెక్ట్.. సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

సూర్యకు తెలుగు, తమిళ్ లో విశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

Suriya: కంగువ ఎఫెక్ట్.. సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Suriya
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2024 | 4:54 PM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గజినీ సినిమా దగ్గర నుంచి సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గజినీ సినిమా దగ్గర నుంచి సూర్య నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సూర్య నటించిన సింగం సినిమా సిరీస్ మనదగ్గర కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య నటించి ఆకట్టుకున్నాడు.

శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దేవి శ్రీ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు.

ఇదిలా ఉంటే తాజాగా సూర్యతో ఓ దర్శకుడు సినిమా చేయను అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరు.? ఎందుకు సూర్యతో సినిమా చేయను అని చెప్పాడు. దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ.. సూర్యతో సినిమా చేయను అని చెప్పి షాక్ ఇచ్చాడు. అలాగే అతను మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద సినిమా (కంగువా) విడుదలై దారుణంగా పరాజయం పాలైంది. అభిమానులు ఈ చిత్రానికి దారుణమైన రివ్యూలు ఇచ్చారు. సినిమా ఫెయిర్‌గా ఉంటే జర్నలిస్టులు, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చితే సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. మీరు సూర్య కోసం సినిమా చేస్తున్నారా.? అనే ప్రశ్నకు మిష్కిన్ మాట్లాడుతూ.. నేను అతనికి కథ చెప్పను. నాకు పిక్చర్ ఇచ్చినా ఒప్పుకోను. ఆయనతో సినిమా చేయను అని మిష్కిన్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి