Devara Movie: దేవర బ్యూటీపై బాడీ షేమింగ్ ట్రోల్స్.. డిప్రెషన్లోకి వెళ్లిన హీరోయిన్.. ఇప్పుడు..
గతేడాది దేవర సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ జపాన్ లో ప్రమోషన్స్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన శరీరంపై వచ్చిన ట్రోల్స్ గురించి బయటపెట్టింది దేవర బ్యూటీ.

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలపై వ్యక్తిగత జీవితాల గురించి ఏదోక న్యూస్ వైరలవుతుంటుంది. లవ్, బ్రేకప్, పెళ్లి గురించి పలు విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇక కొన్నిసార్లు స్టార్స్ లుక్స్, ఫిట్నెస్ పై అనేక విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ట్రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొందరు ఈ నెగిటివిటీని పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుంటారు. మరికొందరు మాత్రం తమదైన స్టైల్లో ట్రోలింగ్ పై స్పందిస్తుంటారు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం తనను బాడీ షేమింగ్ చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మరెవరో కాదు.. ఇటీవల దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
శ్రుతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె అనేక ఫోటోలు, వీడియోలను పంచుకోవడం ద్వారా తన అభిమానులతో కనెక్ట్ అవుతుంది. శ్రుతి మరాఠే తన బరువు కారణంగా తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో తాను మానసికంగా ఒత్తిడికి గురయ్యానని.. చాలా సంవత్సరాలుగా ప్రజలు తన బరువు గురించి మాట్లాడుతున్నారని.. దీనివల తనకు చాలా మానసిక క్షోభ కలిగిందని.. దీంతో తనలో కొన్ని మార్పులు చేసుకున్నట్లు తెలిపింది.
శ్రుతి స్పందిస్తూ “జనాలు మీ శరీరాన్ని నిరంతరం విమర్శిస్తారు. ఒకప్పుడు ‘నువ్వు చాలా లావుగా ఉన్నావు’ అని అనేవారు, అది నన్ను ఒత్తిడికి గురిచేసింది. కానీ ఇప్పుడు ‘నువ్వు ఎంత సన్నగా మారిపోయావు’ అని అంటున్నప్పుడు నవ్వోస్తుంది. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఇవే మాటలు వింటున్నాను. మీరు లోపల ఎలా భావిస్తున్నారో, మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆలోచించకుండా ప్రజలు మీ శరీరం మాట్లాడుతూనే ఉంటారు. అది మీ మానసిక ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఆ విమర్శలను అసలు పట్టించుకోను. మీరు మిమ్మల్ని ప్రేమించండి. మీపై మీరు నమ్మకంగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..