Salman Khan: నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే సికందర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయకగా నటించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హీరోను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎన్నోసార్లు బెదిరింది. అంతేకాకుండా పలుమార్లు సల్మాన్ ఇంట్లో కాల్పులు జరిగాయి. దీంతో సల్మాన్ ప్రాణాలకు రక్షణ కోసం భారీ భద్రతను అందిస్తున్నారు పోలీసులు. మరోవైపు సల్మాన్ ఎక్కడికి వెళ్లిన అధిక భద్రత అందిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడూ సల్మాన్ కు హానీ తలపెడుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు సల్మాన్. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సల్మాన్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గురించి స్పందించారు.
“నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతాను. అంతా ఆయన అధీనంలోనే ఉంటుంది. నా ఆయుష్షు ఎంతవరకు ఆ దేవుడు ఇచ్చాడో అంతవరకు మాత్రమే జీవిస్తాను. ఇదంతా దేవుడి ఇష్టం. గట్టి భద్రత కల్పించారు. ఒక్కోసారి ఇది కూడా పెను సవాలుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు ” అంటూ చెప్పుకొచ్చారు. ‘సికందర్’ గురించి విలేకరుల సమావేశానికి సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌లతో వస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడాడని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తోంది. వారు బహిరంగంగా చంపేస్తామని బెదిరిస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..