AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: అసలైన సంతోషం అంటే అదే.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్న శృతిహాసన్‌..

Shruti Haasan: లోక నాయకుడు కమల్‌ హాసన్‌ వంటి స్టార్‌ హీరో వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి శృతీ హాసన్‌. నటిగా, సింగర్‌గా బహుముఖ ప్రతిభతో అభిమానులను...

Shruti Haasan: అసలైన సంతోషం అంటే అదే.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్న శృతిహాసన్‌..
Narender Vaitla
|

Updated on: May 13, 2022 | 3:44 PM

Share

Shruti Haasan: లోక నాయకుడు కమల్‌ హాసన్‌ వంటి స్టార్‌ హీరో వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి శృతీ హాసన్‌. నటిగా, సింగర్‌గా బహుముఖ ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు శృతి. ఇలా పలుసార్లు తన స్టేట్‌మెంట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో (Social media) అభిమానులతో ముచ్చటించిన ఈ స్టార్‌ హీరోయిన్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఫ్యాన్స్‌తో పంచుకుంది.

ఒకప్పుడు ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని చాలా ప్రయాత్నించానని చెప్పుకొచ్చిన శృతి కానీ దానివల్ల మంచి స్నేహితులను కోల్పోయానని వాపోయింది. కానీ కాలక్రమేణా తాను తనలానే ఉండటం అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇలా చేయడం వల్ల మనమేంటో మనకు తెలుస్తందనీ, అసలైన సంతోషం కూడా అందులోనే ఉంటుందని శృతీ తెలిపింది. ఇక తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ‘నేను అందరితో ఒకేలా ఉంటా, నాలాగే ప్రవర్తిస్తాను. అయితే కొందరు నన్ను ఇష్టపడొచ్చు, మరికొందరికి నా ప్రవర్తన విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నాకు నాలా ఉండడమే ఇష్టం’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

శృతీ హాసన్‌ కెరీర్‌ విషయానికొస్తే చాలా రోజుల తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ‘క్రాక్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘సలార్‌’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.