Hyderabad: భర్తకు తెలియకుండా.. ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్
ఆమెకు పెళ్లైంది, కానీ పక్కదారి పట్టింది, ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా వారితో కలిసి తిరిగింది. ఈ అఫైర్స్ చివరికి ఓ మర్డర్‌కు దారి తీశాయి.
కట్టుకున్న భర్తను ఏమార్చి… మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారిలో ఒకరి ప్రాణాలు తీసిన ఓ నయవంచకి నిజరూపం బైటపడింది. పది రోజుల కిందట హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన మర్డర్ మిస్టరీలో వెలుగు చూసిన తాజా షాకింగ్ న్యూస్ ఇది. ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి మీర్‌పేట్(Meerpet)లోని నందిహిల్స్(Nandi Hills) చౌరస్తాలో దాడికి గురై చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత మృతిచెందిన యశ్మకుమార్ కేసులో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లనుంచి విస్తుగొలిపే విషయాలు బైటపడ్డాయ్. విక్రమ్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకున్న శ్వేతారెడ్డి… ఫేస్‌బుక్‌లో పరిచయమైన యశ్మకుమార్‌తో నాలుగేళ్ల కిందట రిలేషన్ పెట్టుకుంది. తర్వాత కృష్ణా జిల్లా(Krishna District)లో ఓ ప్రైవేట్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కొంగళ్ల అశోక్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. న్యూడ్‌ఫోటోలు బయట పెడతానని హెచ్చరించిన యశ్మకుమార్‌ని వదిలించుకోవాలని ప్లాన్ చేసి.. ఆ స్కెచ్‌లో సెకండ్ బాయ్‌ఫ్రెండ్ అశోక్‌ని వాడేసుకుంది. యశ్మకుమార్‌కు ఫోన్‌చేసి తానుంటున్న ఏరియాకి వచ్చేలా చేసింది. బైక్ మీద ఆ ప్రాంతానికి వస్తున్న యశ్మకుమార్‌ని సుత్తితో చచ్చేంతలా కొట్టి పారిపోయాడు అశోక్. ఆ దారిన వెళ్తున్న కొందరు కాపాడి ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేక… రెండురోజుల తర్వాత చనిపోయాడు యష్మకుమార్. స్పాట్‌లో దొరికిన స్మార్ట్‌ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేసి.. అసలు మిస్టరీని ఛేదించారు పోలీసులు. భర్తకు తెలీకుండా ఒక బాయ్‌ఫ్రెండ్ సాయంతో మరో బాయ్ ఫ్రెండ్‌ని చంపించిన శ్వేతారెడ్డి… ఇప్పుడు ఊచల్లెక్కబెడుతోంది.
హత్యకు గురైన యశ్మకుమార్