Hyderabad: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పబ్స్ అండ్ బార్స్ యజమానులతో సీపీ ఆనంద్..
Hyderabad: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) నగరంలోని పబ్స్, బార్స్ అండ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్స్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 100 మందికి పైగా బార్స్ అండ్ పబ్‌ల యజమానులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Hyderabad: గత నెలలో వెలుగులోకి వచ్చిన పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పబ్‌లో కొకైన్ లభించడం, పలువురు సెలబ్రిటీలు పట్టుబడడంతో డ్రగ్స్ దందాలో భాగ్యనగరం పేరు మరోసారి మార్మోగిపోయింది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది. డ్రగ్స్ దందా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) నగరంలోని పబ్స్, బార్స్ అండ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్స్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 100 మందికి పైగా బార్స్ అండ్ పబ్‌ల యజమానులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పబ్స్ అండ్ బార్స్ నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక సూచనలు జారీ చేశారు సీపీ ఆనంద్. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై కూడా అవగాహన కల్పించారు.
12 గంటల కల్లా క్లోజ్ చేయాల్సిందే..
‘దేశంలో పెట్టుబడులకు బాగా అనుకూలంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ముందుంది. ఇక్కడ శాంతి భద్రతలు, మహిళల భద్రతకు సంబంధించి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో చిన్న పాటి లాభాల కోసం కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి మచ్చతెస్తున్నారు. పబ్స్ అండ్ బార్లలోని సీసీ కెమెరాల బ్యాకప్‌ను సుమారు నెల రోజులు మెయింటయిన్ చేయాలని సీపీ సూచించారు. పబ్‌లలో రాత్రి11 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించరాదు. 12 గంటల కల్లా పబ్స్ మూసివేయాలి. సౌండ్ సొల్యూషన్ విషయంలో కచ్చితంగా నియమ, నిబంధనలు పాటించాలి. పబ్స్ అండ్ బార్లలో డ్రగ్స్ విక్రయిస్తే సహించేది లేదు. అలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీపీ హెచ్చరించారు.
Held a meeting with the managements of pubs,bars & drive-in restaurants to mitigate noise impacts, traffic congestion, public nuisance and urged them to abide by the rules in place regarding timings, parking and sound . pic.twitter.com/aw9DGWPyjF
— C.V.ANAND, IPS (@CPHydCity) May 13, 2022
Reiterated State Govt’s firm stand against drug abuse and informed on precautions to be taken and safeguard the image of the city as the best and safest in the country. pic.twitter.com/lZuGehZpXM
— C.V.ANAND, IPS (@CPHydCity) May 13, 2022
మరిన్ని హైదరాబాద్ నగర వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: