Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: విద్వేషాలు రెచ్చగొట్టి మైనార్టీలను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తోంది.. చింతన్‌ శిబిర్‌ సభలో సోనియా..

Sonia Gandhi: వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా చింతన్‌ శిబిర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే...

Sonia Gandhi: విద్వేషాలు రెచ్చగొట్టి మైనార్టీలను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తోంది.. చింతన్‌ శిబిర్‌ సభలో సోనియా..
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2022 | 3:56 PM

Sonia Gandhi: వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా చింతన్‌ శిబిర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు మళ్లీ మంచి రోజులు తీసుకురావాలంటే ఏం చేయాలనే దానిపై నేతల మేధోమథనం చేయనున్నారు. శుక్రవారం మొదలైన ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సోనియా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సోనియా తనదైన శైలిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ద్వేషాన్ని వ్యాపించడం ద్వారా మైనారిటీలను అణిచి వేస్తోందని ఆమె విమర్శించారు.

సభకు హాజరైన వారిని ఉద్దేశిస్తూ సోనియా మాట్లాడుతూ.. ‘పార్టీ మీకు చాలా ఇచ్చింది. ఇప్పుడు మీరు రుణాన్ని చెల్లించాల్సిన సమయం వచ్చింది. ఏ సంస్థ అయిన మనుగడ సాగించాలంటే మార్పు తీసుకురావాలి. పార్టీకి కూడా ఇప్పుడు సంస్కరణల అవసరం ఉంది.’ అని సోనియా అభిప్రాయపడ్డారు. ఇక మైనార్టీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సోనియా కేంద్రంపై నిప్పులు చెరిగారు. బీజేపీ దేశ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోందని, గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని విమర్శించారు.

సోనియా ఇంకా మాట్లాడుతూ.. ‘దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను అణిచివేస్తున్నారు. మినిమం గవర్నమెంట్‌, మ్యాగ్జిమమ్‌ గవర్నెన్స్‌ అని చెప్పారు. దాని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమేనా?’ అంటూ కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను భయపెట్టడం, అభ్రదతతో ప్రజలను బతికేలా చేయడం, సమాజంలో భాగమైన మైనార్టీలను బలి పశువులను లక్ష్యంగా చేసుకొని క్రూరంగా హింసిస్తున్నారు అంటూ బీజేపీపై సోనియా మండి పడ్డారు.

ఇవి కూడా చదవండి