Kangana Ranaut: మహేశ్‌ వ్యాఖ్యలపై స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ కంగనా.. ఆయన అన్నదాంట్లో తప్పేముందంటూ..

Mahesh Babu: తనకు తెలుగులోనే కంఫర్ట్‌గా ఉందని, బాలీవుడ్‌ ఇండస్ట్రీ తనను భరించలేదని చెప్పిన మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగింది.

Kangana Ranaut: మహేశ్‌ వ్యాఖ్యలపై స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ కంగనా.. ఆయన అన్నదాంట్లో తప్పేముందంటూ..
Mahesh And Kangana
Follow us
Basha Shek

|

Updated on: May 13, 2022 | 2:58 PM

Mahesh Babu: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గురువారం (మే12)న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మహేశ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తనకు తెలుగులోనే కంఫర్ట్‌గా ఉందని, బాలీవుడ్‌ ఇండస్ట్రీ తనను భరించలేదని చెప్పిన మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగింది. కొంతమంది మహేశ్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీంతో తన వ్యాఖ్యలపై మహేశ్‌ కూడా వివరణ ఇచ్చారు. ‘నాకు అన్ని భాషల మీద గౌరవం ఉంది. నాకు తెలుగులో కంఫర్ట్ గా ఉందనే చెప్పాను’ అని చెప్పుకొచ్చారు. అయితే మహేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కూడా ఈ జాబితాలో చేరింది. తన తాజా సినిమా ధాకడ్‌ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె.. ‘ మహేశ్‌ బాబు అన్నది నిజమే. ఆయన్ను బాలీవుడ్‌ భరించలేదు. ఎందుకంటే బాలీవుడ్‌ నుంచి ఎంతోమంది ఆయనతో సినిమా చేయడానికి సంప్రదించారో నాకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్‌ అన్ని ఇండస్ట్రీలను అధిగమించి దేశంలోనే నంబర్‌వన్‌ ఇండస్ట్రీగా ఉంది. అకాబట్టి ఆయనకు తగిన రెమ్యునరేషన్‌ను బాలీవుడ్‌ ఇవ్వలేదు. అయినా మహేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఎందుకు వివాదం చేస్తున్నారో అర్థం కావట్లేదు. టాలీవుడ్‌పై, తన పనిపైనా మహేశ్‌ గౌరవం చూపడం వల్లే ఆయన ఈ స్థాయిలో ఉండగలిగారు. దాన్ని మనందరం అంగీకరించాలి. ఇంకా టాలీవుడ్‌ను చూసి మనం చాలా నేర్చుకోవాలి’ అని కంగనా మహేశ్‌ను సమర్థిస్తూ మాట్లాడింది.

కాగా గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కూడా ప్రశంసల వర్షం కురిపించింది కంగనా. డైరెక్టర్‌ రాజమౌళికి తాను అభిమానినంటూ, ఆయన లాంటి వ్యక్తి రోల్‌ మోడల్‌ ఉండడం తమ అదృష్టమంటూ ఆకాశానికికెత్తాశారు. కాగా కంగనా నటించిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ధాకడ్‌. పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమా మే20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించనుందీ అందాల తార. అర్జున్‌ రాంపాల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Sarkaru Vaari Paata: కళావతి పక్కన కళకళలాడుతున్న ఈ భామ ఎవరు ?.. నెట్టింట్లో వెతుకులాట..

Sarkaru Vaari Paata Day 1 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద వేట షూరు చేసిన మహేష్.. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్..

Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..