Sarkaru Vaari Paata: కళావతి పక్కన కళకళలాడుతున్న ఈ భామ ఎవరు ?.. నెట్టింట్లో వెతుకులాట..
సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా గురువారం (మే 12న) విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతుంది.
ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట (Sarkaru vaari paata) మేనియా నడుస్తోంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా గురువారం (మే 12న) విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతుంది. మహేష్ వ్యన్ మ్యా్న్ షోగా ఈ సినిమా మొత్తం నడిచింది. అంతేకాకుండా.. మహేష్ చెప్పే డైలాగ్స్.. లుక్స్.. నటనతో సినిమాకు మరో లెవల్ అని చెప్పొచ్చు.. అలాగే కీర్తి సురేష్ సైతం ఈ సినిమాలో మరింత అందంగా.. సన్నజాజిలా కనిపించి ఆకట్టుకుంది.. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 36 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి నెటిజన్స్ సోషల్ మీడియాలో ఓ అమ్మాయిగా గురించి తెగ సెర్చ్ చేసేస్తున్నారట.
ఇక హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి.. ప్రేక్షకుల చూపులను కట్టిపడేసింది. హీరోయిన్గా నటిస్తోన్న కీర్తికి.. పక్కన ఉన్న ఆ అమ్మాయి కూడా హీరోయిన్ కంటే తక్కువేం కాదు అన్నట్లుగా కనిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్… కీర్తి కాకుండా…ఆ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
దీంతో ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవడానికి నెట్టింట్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టేశారు నెటిజన్స్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు కదూ.. ఆ గ్లామరస్ బ్యూటీ పేరు సౌమ్య మీనన్.. మలయాళీ ముద్దుగుమ్మ.. మలయాళంలో అరడజను సినిమాలు చేసిన సౌమ్య.. కన్నడలో హంటర్ అనే సినిమా చేసింది.
అంతేకాకుండా.. తెలుగులో టాక్సీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా ఛాన్స్ కొట్టేసింది.. ఇందులోనూ ఆమె పేరు సౌమ్య నే కావడం విశేషం.. స్క్రీన్ పై కనిపించింది కాసేపైనా.. స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో లెహరాయి అనే మూవీ చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..