Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం విక్రమ్. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి

Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
Kamal Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2022 | 9:13 AM

తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్‏కు (Kamal Haasan) తెలుగులోనూ ఎంతటి భారీ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల మనసులలో కమల్ చెరగని ముద్ర వేసుకున్నారు.. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం విక్రమ్. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి.. ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విక్రమ్ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది..

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‏తోపాటు.. మరో తమిళ్ స్టార హీరో నటిస్తున్నారట… అతనెవరో కాదండోయ్.. హీరో సూర్య. ఇందులో గెస్ట్ రోల్ లో అలరించనున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయం గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు…కానీ విక్రమ్ సినిమా లొకేషన్ లో సూర్య సందడి చేస్తోన్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న క్రమంలోనే ఇప్పుడు సూర్య సైతం గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు…విక్రమ్ మూవీలో సూర్య నటిస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..