Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

సర్కారు వారి పాటతో (Sarkaru Vaari Paata) మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు'' అన్నారు దర్శకుడు పరశురాం.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు..  డైరెక్టర్ పరశురాం
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

| Edited By: Shiva Prajapati

Updated on: May 12, 2022 | 10:47 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’కు ప్రీమియర్ షో నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. సర్కారు వారి పాటతో (Sarkaru Vaari Paata) మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు” అన్నారు దర్శకుడు పరశురాం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. మొదటి ఆట నుండే సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ , క్లాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చింది. మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా అయితే బావుంటుదని బలంగా నమ్మి సెట్స్ కి వెళ్ళడం జరిగిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. మార్నింగ్ షో నుండి కొనసాగుతున్న ప్రభంజనం అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇంకా బలంగా తాకుతుందని నమ్ముతున్నాను. సర్కారు వారి పాట దేశం ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐ తో ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ మనిషి వుండరు. అలాంటి పాయింట్ ని మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. ఇలాంటి కథ రాయడం రచయిత, దర్శకుడిగా నాకూ ఒక తృప్తిని ఇచ్చింది. సర్కారు వారి పాటని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ” అన్నారు పరశురామ్

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా అద్భుతంగా వుందని సందేషాలు పంపుతున్నారు. ఇంత ఘన విజయం ఇచ్చిన మా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, దర్శకుడు పరశురామ్ గారి చాలా కృతజ్ఞతలు. 2020లో ప్రాజెక్ట్ అనుకున్నాం. తర్వాత ప్యాండమిక్ వచ్చింది. అయితే ఈ రెండేళ్ళ కష్టం.. సర్కారు వారి పాట కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఒక్కసారిగా ఎగిరిపోయింది. మా బ్యానర్ లో బెస్ట్ రెస్పాన్స్ వచ్చిన మూవీ సర్కారు వారి పాట. సుదర్శన్ లో సినిమా చూశాం. ఈ రెండు వారాలు భారీ కలెక్షన్స్ సాధించబోతుంది. యూఎస్ ప్రిమియర్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులన్నీ క్రాస్ చేసింది. అదే స్థాయిలో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్

MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో