Sai Pallavi: సాయి పల్లవి క్రేజ్ అంటే ఇదే కదా.. బ్యానర్లతో అభిమానుల సందడి.. స్పీచ్ అదరగొట్టిన వెన్నెల..

వెంకటేష్ గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. విరాట పర్వం నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా అవుతుంది. యదార్ధ సంఘటనలు ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు

Sai Pallavi: సాయి పల్లవి క్రేజ్ అంటే ఇదే కదా.. బ్యానర్లతో అభిమానుల సందడి.. స్పీచ్ అదరగొట్టిన వెన్నెల..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2022 | 11:55 AM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) క్రేజ్ గురించి తెలిసిన విషయమే.. ఇటీవల డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టుగానే టాలీవుడ్ లేటీ పవర్ స్టార్‏గా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. కంటెంట్, హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్ ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైంది. ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం విరాట పర్వం. డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రానా హీరోగా నటిస్తుండగా.. ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సాయి పల్లవి ఫోటోతో కూడిన బ్యానర్లతో సందడి చేశారు ఆమె అభిమానులు.. ఆ తర్వాత సాయి పల్లవి మాట్లాడేందుకు మైక్ తీసుకున్న వెంటనే అభిమానులు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేశారు.. ఆమె మాట్లాడుతున్నంతసేపు కేకలు.. అరుపులతో హంగామా సృష్టించారు. ఇక సాయి పల్లవి సైతం ఏ మాత్రం గర్వం లేకుండా.. చక్కగా తెలుగులో మాట్లాడి అభిమానులను ఖుషి చేసింది..

ఈ సందర్బంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. వెంకటేష్ గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. విరాట పర్వం నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా అవుతుంది. యదార్ధ సంఘటనలు ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు చేయలేదు. విరాట పర్వం చాలా కొత్త, గొప్ప అనుభూతిని ఇచ్చింది. మీకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని నమ్ముతున్నాను. వెన్నెల లాంటి గొప్ప పాత్ర ఇచ్చిన వేణు గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం తర్వాత కూడా వేణు గారు మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తారని నమ్ముతున్నాను. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి, నాగేంద్ర గారు ఇలా సాంకేతిక నిపుణులు అంతా గొప్పగా పని చేశారు. వారు చేసిన వర్క్ ని మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. ఈశ్వరి గారు, నవీన్ చంద్ర, సాయి చంద్ గారు , ప్రియమణి. జరీనా వాహేబ్, రాహుల్ .. వీరి పాత్రలన్నీ చాలా గొప్పగా వుంటాయి. నిర్మాతలు సుధాకర్ గారు, శ్రీకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. విరాట పర్వాన్ని ఒక బిడ్డలా చూసుకున్నారు. వారికీ ఎంత థాంక్స్ చెప్పుకున్నా తక్కువే.

ఇవి కూడా చదవండి
Sai Pallavi 1

Sai Pallavi 1

రానా గారు గొప్ప మనసున్న మనిషి. ఆయన ఎత్తుకు తగ్గట్టే పెద్ద మనసున్న మనిషి. గొప్ప కథలు, మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రానా గారు మన ఇండస్ట్రీకి టార్చ్ బ్యారర్ లాంటి వారు. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. జూన్ 17న విరాట పర్వం చూడండి. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించండి. విరాట పర్వం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మీ ప్రేమకు కోటి ధన్యవాదాలు” అని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్