Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్.. ఆ యంగ్ హీరో సరసన రాధిక..

రాధిక పాత్రలో నటించి మెప్పించిన నేహాకు ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటుంది.. తాజాగా మరో ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది.

Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్.. ఆ యంగ్ హీరో సరసన రాధిక..
Neha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2022 | 10:59 AM

మెహబూబా సినిమాతో వెండితెరకు పరిచయమైంది నేహా శెట్టి.. ఆ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.. ఇటీవల యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. అంతేకాకుండా.. నేహా శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రాధిక పాత్రలో నటించి మెప్పించిన నేహాకు ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటుంది.. తాజాగా మరో ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాలో కథానాయికగా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సమ్మతమే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కాకుండా.. రూల్స్ రంజన్ అనే ప్రాజెక్టును కూడా మొదలు పెట్టేశాడు ఈ యంగ్.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ మూవీలో కిరణ్ సరసన హీరోయిన్ నేహా శెట్టిని ఎంపిక చేశారు. . ఈ చిత్రాన్ని స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై దివ్యాంగ్ లవానియా. వి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు