AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Venu Udugula: పాటకు పల్లవి.. ఈ సినిమాకు సాయి పల్లవి అంతే ముఖ్యం.. డైరెక్టర్ వేణు ఉడుగుల కామెంట్స్ వైరల్..

1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రలో రానా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి

Director Venu Udugula: పాటకు పల్లవి.. ఈ సినిమాకు సాయి పల్లవి అంతే ముఖ్యం.. డైరెక్టర్ వేణు ఉడుగుల కామెంట్స్ వైరల్..
Venu Udugula
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2022 | 7:09 AM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. రానా దగ్గుబాటి జంటగా నటిస్తోన్న చిత్రం విరాట పర్వం (Virata Parvam). డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 17న థియేటర్లలో సందడి చేయబోతుంది. 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రలో రానా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుండగా.. ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్…ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు…

ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “సింహాలు వాటి చరిత్రను అవి రాసుకోలేనంతవరకు వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది.. అలాగే మన జీవితాలను మనం ఆవిష్కరించనంత వరకు పక్కవాళ్లు చెప్పేదే మన సంస్కృతి అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్పూర్తితో నా మూలల్లోకి వెళ్లి ఈ సినిమాను తీశాను…ప్రేమ ఒక దైవం.. ప్రేమకు మించిన ప్రజాస్వామిక విలువ ఈ భూమి మీద ఏది లేదని ఈ సినిమా ద్వారా చెప్పాం.. 1990 దశకంలో రాజకీయ సంక్షోభాన్ని బేస్ చేసుకుని ఈ లవ్ స్టోరీ యాడ్ చేసి సినిమాను తీశాం.. పాటకు పల్లవి ఎంత ముఖ్యమో.. ఈ సినిమాకు సాయి పల్లవి అంతే ముఖ్యం.. రానా చంద్రుడు అయితే సాయి పల్లవి వెన్నెల.. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ అద్భుతంగా నటించారు… ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది… ఇది గొప్ప జ్ఞాపకంగా నిలుస్తుంది ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!