Rashi Khanna: నాగచైతన్య పై రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఎక్కువగా ప్రేమిస్తారంటున్న హీరోయిన్..

ఎదుటి వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉండ‌టం అనే దానికి నేను చాలా ప్రాముఖ్య‌త‌నిస్తాను. అందుక‌నే ఈ స్క్రిప్ట్ నాకు బాగా న‌చ్చింది.

Rashi Khanna: నాగచైతన్య పై రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..  ఎక్కువగా ప్రేమిస్తారంటున్న హీరోయిన్..
Rashi Khanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2022 | 3:59 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య () తనకు అమెజింగ్ కోస్టార్ అని అన్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. మంగళవారం జరిగిన థాంక్యూ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గోన్న రాశీ చైతూపై పొగడ్తల వర్షం కురిపించింది. థాంక్యూ చిత్రానికి డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించగా.. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మంగళవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చైతూ మరింత స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నారు.

రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘‘ఎదుటి వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉండ‌టం అనే దానికి నేను చాలా ప్రాముఖ్య‌త‌నిస్తాను. అందుక‌నే ఈ స్క్రిప్ట్ నాకు బాగా న‌చ్చింది. ఇంత మంచి క‌థ‌, స్క్రిప్ట్ రాసిన బి.వి.ఎస్‌.రవిగారికి థాంక్స్‌. విక్ర‌మ్ కుమార్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. ప్రియా అనే మంచి పాత్ర‌ను నాతో చ‌క్క‌గా చేయించారు. అలాగే పీసీ శ్రీరామ్‌గారికి కూడా థాంక్స్ చెప్పాలి. నన్ను చాలా అందంగా చూపించాలి. ప్ర‌తి ప్రేమ్ ఓ పెయింటింగ్‌గా ఉండాలి. చైత‌న్య అమేజింగ్ కోస్టార్‌. ఈ సినిమా కోసం త‌ను ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ అని భావిస్తున్నాను. క‌చ్చితంగా ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ చైత‌న్య ఇంకా ఎక్కువ‌గా ప్రేమిస్తారు. మాపై న‌మ్మ‌కంతో సినిమా చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్‌. జూలై 22న సినిమా రిలీజ్ అవుతుంది. మీ స‌పోర్ట్ మాకు అవ‌స‌రం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.