Ranbir Kapoor: అల్లు అర్జున్ సినిమా పై రణబీర్ కపూర్ ఓపెన్ కామెంట్స్.. ఆ పాత్రలో నటించాలని ఉందంటున్న హీరో..

ప్రస్తుతం ఈ హీరో షంషేరా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు.

Ranbir Kapoor: అల్లు అర్జున్ సినిమా పై రణబీర్ కపూర్ ఓపెన్ కామెంట్స్.. ఆ పాత్రలో నటించాలని ఉందంటున్న హీరో..
Ranbir
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2022 | 11:11 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి నార్త్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ప్రేక్షకులే కాకుండా సెలబ్రెటీస్, క్రికెటర్స్ సైతం పుష్పరాజ్ మేనేరిజాన్ని ఫాలో అయ్యారు. క్రికెట్, బాక్సింగ్ స్టెడియంలలో పుష్పరాజ్ స్టైల్ ఫాలో అయిన సంతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా తనకు ఫెవరేట్ అని చెప్పుకొచ్చాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. ప్రస్తుతం ఈ హీరో షంషేరా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

ఇటీవల మీరు చేయాలనుకున్న పాత్ర ఏమిటి?” అని విలేకరి అడగ్గా.. తాను అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పుష్పరాజ్ రోల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అల్లు అర్జున్ పోషించిన విధానం తనకు చాలా నచ్చిందని, ఈ సినిమా సీక్వెల్‌ని చూడాలని ఆసక్తిగా ఉన్నానని రణబీర్ చెప్పాడు. తన పెట్ డాగ్‏తో కలిసి తగ్గేదే లే సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించాడు.

అలాగే..” ఆల్-టైమ్ ఫేవరెట్ బుక్, ఇంకా చాలా ఉన్నాయి. రామాయణం, దేవదత్ పట్నాయక్ రచించిన జయ, ది ఆల్కెమిస్ట్, మార్లోన్ బ్రాండో ద్వారా నా తల్లి నాకు నేర్పించిన పాటలు” అని రణబీర్ వెల్లడించాడు. తన తల్లి నీతూ కపూర్, భార్య అలియాతో గడపడం తనకు చాలా ఇష్టమని తెలిపారు. రణబీర్ వాణి కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలలో నటించిన షంషేరా ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. అలాగే బ్రహ్మాస్త్రలో కూడా రణబీర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!