Brahmastra: బ్రహ్మాస్త్ర కథ పుట్టింది ఆ ఆలోచన నుంచే.. ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్.. వీడియో సూపర్..
అందులో అసలు బ్రహ్మాస్త్ర ఏంటీ ? ఎందుకు ఈ సినిమాను తీయాల్సి వచ్చింది ?.. ఈ అస్త్రాలు, అస్త్ర వర్స్ అంటే ఏమిటీ ఏలా వచ్చాయి ? అనే విషయాలను క్షుణ్ణంగా వివరించాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ
మోస్ట్ అవైయిటెడ్ చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. రణబీర్ కపూర్, అలియా, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేయనున్నారు. ఇందులో అమితాబ్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
అందులో అసలు బ్రహ్మాస్త్ర ఏంటీ ? ఎందుకు ఈ సినిమాను తీయాల్సి వచ్చింది ?.. ఈ అస్త్రాలు, అస్త్ర వర్స్ అంటే ఏమిటీ ఏలా వచ్చాయి ? అనే విషయాలను క్షుణ్ణంగా వివరించాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. పురాణాల్లో అస్త్రాల గురించి అనేక వివరాలున్నాయి. అందులో అన్నింటికీ గురువైన బ్రహ్మాస్త్రం గురించి ఒకప్పుడు కొందరు ఋషులు మహా యాగం చెయ్యగా అనంత విశ్వం నుంచి ఒక స్వచ్చమైన శక్తి కిందకు వచ్చి.. ఒక్కొక్కరికి ఒక్కో శక్తి అశ్త్రం అందించింది. అప్పటి నుంచి వారి వంశపారంపర్యంగా ఇప్పటికీ ఈ ప్రస్తుత ప్రపంచంలో ఆ శక్తులు కలిగిన వ్యక్తులున్నారు. ఇప్పుడు వారి కథనే మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇందులో మొదటి భాగంగా వస్తున్న శివ పార్ట్ నాకు ఇష్టమైనది అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. తాజాగా విడుదలైన వీడియో మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.
Ayan Mukerji’s Vision of Brahmāstra and the Concept of the Astraverse… https://t.co/y6JxLuZrNH
— rajamouli ss (@ssrajamouli) July 13, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.