SP Charan: ‘నేనెప్పుడు ఆ మాట చెప్పలేదు.. ఇది నాకు మిలియన్ డాలర్ల ప్రశ్న’.. ఎస్పీ చరణ్ కామెంట్స్ వైరల్..

ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ, ఆర్పీ పట్నాయక్.. ఇలా అందరి

SP Charan: 'నేనెప్పుడు ఆ మాట చెప్పలేదు.. ఇది నాకు మిలియన్ డాలర్ల ప్రశ్న'.. ఎస్పీ చరణ్ కామెంట్స్ వైరల్..
Sp Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2022 | 12:04 PM

డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సీతారామం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా వస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఓహ్ సీతా, ఇంతందం ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ (SP Charan) ఈ రెండు పాటలని అద్భుతంగా ఆలపించారు. ఆయన వాయిస్ సంగీత ప్రియులని మెస్మరైజ్ చేస్తోంది. ఈసినిమా ప్రమోషన్లలో భాగంగా ఎస్పీ చరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సీతా రామం’ చిత్ర విశేషాలివి.

ఒకప్పుడు తెలుగులో ఉదృతంగా పాడారు. తర్వాత ఒక్కసారిగా తగ్గించేశారు. నిర్మాణం వైపు వెళ్ళడం దీనికి కారణమని భావిస్తున్నారా ? అని విలేకరి అడగ్గా.. చరణ్ స్పందిస్తూ.. ” ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ, ఆర్పీ పట్నాయక్.. ఇలా అందరి సంగీత దర్శకుల దగ్గర నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి. జనాదరణ పొందాయి. అయితే తర్వాత ఎందుకు అవకాశాలు కుదరలేదో నాకైతే తెలీదు. నిర్మాణంలో బిజీగా వుండటం వలన పాడలేననే మాట నేను ఎన్నడూ చెప్పలేదు. రికార్డింగ్ కి ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి నేను అందుబాటులో ఉంటాను. ప్రస్తుతం తమిళంలో చిత్రాలు నిర్మిస్తున్నాను. ఇంకా తెలుగులో ప్రారంభించలేదు. సంగీతంలో వచ్చిన మార్పులు గురించి మాట్లాడాల్సినంత పెద్ద వాడిని కాదు, నేను వచ్చే పాతికేళ్ళు అవుతుంది. ఒక సింగర్ గా పాట పట్ల నా అప్రోచ్ మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మెలోడి పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా సెన్సిబుల్ గా మంచి పరిజ్ఞానంతో వున్నారు. దర్శక నిర్మాతలు కొత్త సంగీత దర్శకులని గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం ఆనందంగా ఉంది ” అని తెలిపారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!