Venu Thottempudi: అల్లు అర్జున్ సినిమా నేను చేయాల్సింది.. కానీ.. హీరో వేణు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ సినిమాలో వేణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నారు. డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Venu Thottempudi: అల్లు అర్జున్ సినిమా నేను చేయాల్సింది.. కానీ.. హీరో వేణు ఆసక్తికర వ్యాఖ్యలు..
Venu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2022 | 11:45 AM

స్వయంవరం, చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో తొట్టెంపూడి (Venu Thottempudi). ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన వేణు గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన వేణు ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో వేణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నారు. డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గోన్న వేణు తన కెరీర్.. వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. నీ సినిమా ఆడితేనే నా మేనల్లుడివి అని చెప్పుకుంటా. లేదంటే చెప్పను అని తన మావయ్య మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు అనేవారని చెప్పుకొచ్చారు వేణు..

వేణు మాట్లాడుతూ.. ” నా ఎత్తు 6.3 అడుగులు. చాలా మంది ఆలీతో సరదాగా షోకి వెళ్తున్నారు.. నువ్వెప్పుడు వెళ్తావ్ అని మా అమ్మ అడిగేది. ఇంట్లో అబద్ధం చెప్పి సినిమాలకు వెళ్లి మా నాన్నకు దొరికిపోయేవాడిని. దీంతో నాన్న నన్నుకొట్టేవారు. మొదటి డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వంలో అరంగేట్రం చేయాల్సింది. కానీ ఆ అవకాశం మిస్ అయ్యింది. పూరి జగన్నాథ్ కలిసి దేశముదురు కథ వినిపించారు. అన్నీ చేసి సినిమా చేయలేదు. ” అంటూ చెప్పుకొచ్చారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!