Actress Rambha : ఆ హీరో ప్రపంచంలోనే బెస్ట్ డ్యాన్సర్.. అతడు ఎంతో కష్టపడితే పేరు నాకొచ్చింది.. హీరోయిన్ రంభ..
నటి రంభ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రమ్యకృష్ణతో పోటీ, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ నైపుణ్యం, త్రిషతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. అంతేకాకుండా, తన ఐస్‌క్రీమ్ ఇష్టాలు, చిరంజీవికి చెందిన అద్దం గురించి సీక్రెట్‌గా వెల్లడించారు.

నటి రంభ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ హైలైట్స్, ఇష్టమైన విషయాలు, కొన్ని దాచిపెట్టిన రహస్యాలను వెల్లడించారు. సమకాలీన నటీమణులలో ఎవరు పోటీగా భావించేవారని అడగగా, రంభ రమ్యకృష్ణ పేరు ప్రస్తావించారు. రమ్యకృష్ణతో పోటీగా కాకుండా, ఆమెతో కలిసి నటించేటప్పుడు భయమేసేదని, ఆమె సీనియర్ అని, తాను కొత్తగా వచ్చినప్పుడు ఆమె చాలా సహకరించేవారని రంభ గుర్తుచేసుకున్నారు. రోజా, మీనాలతో తక్కువ సినిమాలు చేయటం వల్ల వారిని పోటీగా భావించలేదని చెప్పారు. ప్రస్తుత నటీమణులలో నయనతార, ఇలియానా, కాజల్, త్రిషలలో త్రిష తనకు చాలా ఇష్టమని రంభ తెలిపారు. త్రిష ఆప్యాయంగా మాట్లాడే స్వభావం తనకు నచ్చుతుందని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..
యువ హీరోలలో ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌లలో ఎవరి సరసన నటించే అవకాశం వస్తే నటిస్తారు అని అడగగా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో తాను ఇదివరకే నటించానని, ప్రభాస్, మహేష్ బాబులతో నటించలేదని, అవకాశం వస్తే వారితో నటించేందుకు ఆలోచిస్తానని చెప్పారు. తన స్పెషల్ సాంగ్స్‌లో నాచోరే నాచోరే తనకు చాలా ఇష్టమని రంభ పేర్కొన్నారు. ఈ పాట తన పేరును బాగా పాపులర్ చేసిందని, జూనియర్ ఎన్టీఆర్ కష్టపడితే, పేరు మాత్రం తనకి వచ్చిందని సరదాగా చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..
డ్యాన్స్ చేసిన స్టార్స్‌లో అత్యుత్తమ డ్యాన్సర్ ఎవరు అని ప్రశ్నించగా, చిరంజీవి తనకి చాలా ఇష్టమైన నటుడు, పెద్ద అభిమాని అయినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని, అతను “బెస్ట్ డాన్సర్” అని రంభ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక మూమెంట్ కోసం ఎంత కష్టపడతాడో, పాదాలు వాచిపోయినా ఎలా ప్రయత్నిస్తాడో వివరించారు. అతని అంకితభావం చూసిన తర్వాత మైఖేల్ జాక్సన్ వచ్చినా ఎన్టీఆరే బెస్ట్ డాన్సర్ అని రంభ ప్రశంసించారు. ప్రభుదేవా మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్‌గా చాలా మంచివారని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Rambha, Jr.ntr
ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
