AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Prema: రెండో పెళ్లి, క్యాన్సర్ వ్యాధి వార్తలపై స్పందించిన కన్నడ సోయగం ప్రేమ

 Actress Prema: సినీ పరిశ్రమలో హీరోలకు ఉన్నంత కెరీర్ .. హీరోయిన్లుకు ఉండదు.. అందం, అభినయం కు తోడు.. లక్ కలిసి వస్తే.. ఒక్కసినిమాతోనే స్టార్ హీరోయిన్..

Actress Prema: రెండో పెళ్లి, క్యాన్సర్ వ్యాధి వార్తలపై స్పందించిన కన్నడ సోయగం ప్రేమ
Prema
Surya Kala
|

Updated on: Jun 02, 2021 | 5:29 PM

Share

Actress Prema:

సినీ పరిశ్రమలో హీరోలకు ఉన్నంత కెరీర్ .. హీరోయిన్లుకు ఉండదు.. అందం, అభినయం కు తోడు.. లక్ కలిసి వస్తే.. ఒక్కసినిమాతోనే స్టార్ హీరోయిన్లు అయిపోతారు. అయితే హీరోయిన్లు ఎంత వేగంగా వస్తారో.. అంత త్వరగా ఫెడ్ అవుట్ అయిపోతారు. కొంతమంది ఇండస్ట్రీ నుంచి మాయమైతే.. మరికొందరు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తల్లి పాత్రలకు షిప్ట్ అవుతున్నారు. హీరోయిన్ గా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టున్నారో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాంటి నటీమణుల్లో ఒకరు ప్రేమ. టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ధర్మ చక్రం మూవీతో ప్రేమ హీరోయిన్ గా అడుగు పెట్టింది. అమాయకత్వం, అందం. అభినయంతో ఆకట్టుకుంది. ఇక ప్రేమ నటించిన దేవి సినిమా ఆ సమయంలో ఓ సంచనలం సృష్టించింది. కన్నడ, తమిళ్, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది ప్రేమ. అయితే ప్రేమ హీరోయిన్ గా కెరీర్ అతి తక్కువ కాలమే.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వరసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. అయితే ప్రేమ వ్యక్తిగత జీవితం పై ఇటీవల అనేక వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ప్రేమ ఆరోగ్యం గురించి రెండో పెళ్లి గురించి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయం పై ప్రేమ ఓ ఇంటర్యూలో స్పందించింది.

కన్నడం లో ఓం సినిమా ప్రేమ కు ఎంత క్రేజ్ ను తెచ్చిందో తెలుగులో దేవి మూవీ కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ అయ్యింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం ఎస్ రాజు ఈ సినిమాను తెరక్కించారు. ఆ సినిమాతోనే దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అప్పట్లో దేవి మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఇటీవల ప్రేమ రెండవ వివాహంపై కన్నడ సినిమా ఇండస్ట్రీలో అనేక కథనాలు వినిపించాయి. ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకు ఆమె అతని నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. తన విడాకులపై ప్రేమ ఎప్పుడు స్పందించలేదు. పెళ్లి, విడాకులు తన వ్యక్తిగత విషయం అని అందరికీ తెలిసేలా మాట్లాడడం తనకు నచ్చదని ఇటీవల ప్రేమ చెప్పింది. అంతేకాదు.. తాను కూడా క్యాన్సర్ బారిన పడినట్లు.. అయితే ఇప్పుడు క్యాన్సర్ ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పింది అయితే తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఒంటరిగా ఉన్నానని తెలిపింది. అంతే కాకుండా తనకు పిల్లలున్నారు అనే వార్తలు కూడా అవాస్తవమని కొట్టిపడేసింది ఈ కన్నడ సోయగం ప్రేమ. ప్రస్తుతం ప్రేమ కన్నడ, తెలుగు సినిమాల్లో తల్లిపాత్రల్లో నటిస్తుంది.

Also Read: ఈ ఐదు విషయాలు నమ్మదగినవి కావు, అవి ఎప్పుడైనా మనిషిని మోసం చేయగలవని చెప్పిన చాణిక్యుడు