AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandeep Kishan: ఓటీటీ వైపు చూస్తున్న యంగ్ హీరో.. సందీప్ కిషన్ రెండు సినిమాలు విడుదల అక్కడే ?..

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో..

Sandeep Kishan: ఓటీటీ వైపు చూస్తున్న యంగ్ హీరో.. సందీప్ కిషన్ రెండు సినిమాలు విడుదల అక్కడే ?..
Sandeep Kishan
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2021 | 6:12 PM

Share

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో.. ఎన్నో సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఇక థియేటర్లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకపోవడంతో బారీ ప్రాజెక్ట్ సినిమా నిర్మాతలు సైతం ఆలోచనలలో పడ్డారు. అయితే కరోనా ప్రభావంతో ఓటీటీ వేదికలకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలో విడుదలైన మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాలు కూడా ఓటీటీలో రీలిజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

సందీప్ కిషన్.. గత కొద్ది రోజుల క్రితం నరగసూరన్ అనే సినిమా చేశాడు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ధ్రువంగల్ పదినారు సినిమాకు రీమేక్ గా నరగసూరన్ తెరకెక్కించారు యంగ్ డైరెక్టర్ కార్తీక్. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తైన కానీ.. విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇందుకు కారణం.. టాప్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, దర్శకుడు కార్తీక్ కు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే అని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల చేయనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్న థియేటర్లు మాత్రం మూతపడ్డాయి. దీంతో దీనిని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ సినిమాతోపాటు.. సందీప్ కిషన్ నటించిన తమిళ అంథాలజీ.. కసడ తపర సినిమా కూడా సోనీ లైవ్ ఓటీటీలో జూన్ లో విడుదల కానున్నట్లుగా సమాచారం. ఈ చిత్రానికి చింబు దేవన్ దర్శకత్వం వహించారు.

Also Read: కేజీఎఫ్ హీరో యష్ గొప్ప మనసు.. సినీ కార్మికులకు రూ.1.5 కోట్లు విరాళం.. ప్రశంసిస్తున్న అభిమానులు.. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం..

Mani Ratnam Birthday: నాటికి.. నేటికి.. ఆయన సినీ ఇండస్ట్రీలో ఓ నవరత్నం.. ఈ ‘మణి’రత్నం..

సప్తస్వరాలతో ఆయన పలికించిన రాగాలెన్నో… నేటికి ఆయన సంగీతంలో పరవశించేవారు ఎందరో.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బర్త్ డే నేడు..