AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: మెగా హీరో సినిమాకు కరోనా కష్టాలు.. ఓటీటీ వైపు సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ?

Republic Movie Update: కరోనా మహమ్మారి వలన థియేటర్లు, సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూతపడడంతో ఎన్నో

Sai Dharam Tej: మెగా హీరో సినిమాకు కరోనా కష్టాలు.. ఓటీటీ వైపు సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ ?
Republic Movie
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2021 | 2:55 PM

Share

Republic Movie Update: కరోనా మహమ్మారి వలన థియేటర్లు, సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూతపడడంతో ఎన్నో సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇక కరోనా పరిస్థితులు ఎప్పుడు సద్దుకుంటాయో తెలియకపోవడంతో.. షూటింగ్స్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న నిర్మాతల్లో ఆందోళన క్రమంగా పెరిగిపోతుంది. దీంతో మేకర్స్ చూపు ఓటీటీల వైపు వెళ్తుతోంది. ఓటీటీలలో విడుదలైన సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ప్రస్తుత పరిస్థితులలో తమ సినిమాలను ఓటీటీ వేదికలలో రిలీజ్ చేయడం మంచిదని భావిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ రిపబ్లిక్ కూడా ఓటీటీలో విడుదల కానునన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవా కట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను ముందుగా జూన్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ క్లిష్ట పరిస్థితులలో కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తుండడంతో.. రిపబ్లిక్ మేకర్స్ కూడా ఆ దిశగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్. ఈ సినిమా విడుదల గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read: Shahrukh khan : తమిళ డైరెక్టర్‏తో షారుఖ్ సినిమా.. ఇకనైనా ఈ స్టార్ కాంబో పట్టాలెక్కుతుందా ?

Weight loss: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి తింటే కచ్చితంగా బరువు పెరుగుతారట..

Corona Third Wave: ఇప్పటి నుండీ సంసిద్ధం అయితే కరోనా మూడో వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఎస్బీఐ పరిశోధనా పత్రంలో వెల్లడి