AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahrukh khan : తమిళ డైరెక్టర్‏తో షారుఖ్ సినిమా.. ఇకనైనా ఈ స్టార్ కాంబో పట్టాలెక్కుతుందా ?

Shahrukh khan : బాలీవుడ్ బాద్ షా.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీకి యూత్ ఐకాన్ షారుఖ్ ఖాన్.. అయితే కొన్నెళ్లుగా హిట్ అందుకోవడం లేదు.

Shahrukh khan : తమిళ డైరెక్టర్‏తో షారుఖ్ సినిమా.. ఇకనైనా ఈ స్టార్ కాంబో పట్టాలెక్కుతుందా ?
Sharukh Atlee
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2021 | 2:16 PM

Share

Shahrukh khan : బాలీవుడ్ బాద్ షా.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీకి యూత్ ఐకాన్ షారుఖ్ ఖాన్.. అయితే కొన్నెళ్లుగా హిట్ అందుకోవడం లేదు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ ఖాతాలో హిట్ పడక చాలా సంవత్సరాలు అయ్యింది. కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్యూబ్ లైట్, జీరో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలంటే.. ప్రస్తుతం ఆయనకో హిట్ కావాలి. అందుకే పఠాన్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా.. . వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది.

పఠాన్ తర్వాత షారూఖ్ కు వరుసగా సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందే షారుఖ్ తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో షారూఖ్ మూవీ చేస్తారనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో గత కొంత కాలంగా వినిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరి ప్రాజెక్టు పట్టాలెక్కనుందని టాక్ నడుస్తోంది. అట్లీ.. రాజారాణి, పోలీసోడు, అదిరింది, విజిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాలతో ఏకంగా ఆల్ ఓవర్ ఇండియాకు తన మార్క్ డైరెక్షన్ ను చూపించాడు. విజిల్ తర్వాత రెండేళ్లుగా అట్లీ ఇంతవరకు ఎవరితోనూ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. కేవలం షారూఖ్ ఖాన్ కోసమే.. వెయిట్ చేస్తున్నాట్లుగా సమచారం. ఇటు చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత.. సౌత్ పై మనస్సు పారేసుకున్న బాద్ షా.. అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. అట్లీ మూవీలో షారూఖ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడని కూడా టాక్ నడుస్తుంది. ఒక పాత్రలో పోలీస్ అధికారిగా.. మరో పాత్రలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్.. సెట్స్ పైకి రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో షారుఖ్ హిట్ అందుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి.

Also Read: Ram Pothineni: ఆచితూచి అడుగులేస్తున్న ఎనర్జిటిక్ హీరో.. కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్