Weight loss: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి తింటే కచ్చితంగా బరువు పెరుగుతారట..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jun 02, 2021 | 8:56 PM

శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. అందుకే చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటారు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటే..

Weight loss: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి తింటే కచ్చితంగా బరువు పెరుగుతారట..
Weight Loss

శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. అందుకే చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటారు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటే.. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచేందుకు సహయపడుతుంది. అయితే బరువు తగ్గేందుకు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలని చాలా మంది నమ్ముతుంటారు. చిక్కుళ్లు, విత్తనాలు, పౌల్ట్రీ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని బరువు తగ్గేందుకు తీసుకుంటుంటారు. కానీ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు అధికంగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోకుడదు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

ఏ ఏ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో తెలుసా.. ఒక రోజులో ఎక్కువ మోతాదులో లేదా మోడరేట్ చేయని ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు పౌల్ట్రీ, మాంసం వంటి ప్రోటీన్ ఫుడ్ .. ఇతర ప్రోటీన్ పదార్థాల కంటే ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. అందువల్ల మాంసాహార ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన బరువు తగ్గడం కుదరదు. అధికంగా ప్రోటీన్ తీసుకునేవారి శరీర బరువు, జీవనశైలి వారి అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవడం వలన బరువు పెరగడమే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలను (మానసిక రుగ్మతలు, మలబద్దకం మొదలైనవి) ఎదుర్కోంటారు. పిండి పదార్థాలలో కూడా అధికంగా ప్రోటీన్ ఉంటుంది. తక్కువగా పిండి పదార్థాలను తీసుకోవడం వలన షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన వ్యాయమం చేస్తున్న సమయంలో ఎక్కువగా అలసట, నీరసంగా ఉంటారు. అందుకే వ్యాయమం చేసేముందు తీసుకునే ఆహారం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

Also Read: ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన మెడిసిన్‌లు విషంగా మారతాయి.? వాటిని పొరపాటున వేసుకుంటే ఏమవుతుంది.!

Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కరోనా టైంలో ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu