AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన మెడిసిన్‌లు విషంగా మారతాయి.? వాటిని పొరపాటున వేసుకుంటే ఏమవుతుంది.!

ఈ ఆధునిక యుగంలో పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారందరూ కూడా తరచూ..

ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన మెడిసిన్‌లు విషంగా మారతాయి.? వాటిని పొరపాటున వేసుకుంటే ఏమవుతుంది.!
Medicine
Ravi Kiran
|

Updated on: Jun 02, 2021 | 6:15 PM

Share

ఈ ఆధునిక యుగంలో పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారందరూ కూడా తరచూ టాబ్లెట్స్ వాడుతుంటారు. ఇక మెడిసిన్స్ కొనేటప్పుడు పలు కీలకమైన విషయాలను గుర్తించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. మెడికల్ స్టోర్ నుండి ఏదైనా ఔషదాన్ని కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా దాని ఎక్స్‌పైరీ డేట్‌ను చూడాలి. సాధారణంగా గడువు తేదీ ముగిసిన టాబ్లెట్స్‌ను వాడకూడదనే విషయం మనకు తెలిసిందే. కొన్నిసార్లు మన ఇంట్లో ఉంచిన మందులకు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ముగుస్తుంది.

గడువు ముగిసిన మందులు విషంగా మారతాయని.. వాటి ప్రభావం కూడా ముగుస్తుందని మీకు తెలిసే ఉంటుంది. ఔషదాలపై ఉండే ఎక్స్‌పైరీ డేట్‌ అంటే.. ఒక నిర్దిష్ట సమయం దగ్గర ఆ మెడిసిన్ విషంగా మారుతుందని కాదు.. అసలు మెడిసిన్స్‌పైన రాసి ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌‌కు అర్ధం ఏంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.!

ఎక్స్‌పైరీ డేట్‌ అర్థం ఏమిటి..?

మీరు ఏదైనా మెడిసిన్‌ను కొనుగోలు చేస్తే, మీరు దాని ప్యాక్‌పైన రెండు తేదీలను చూస్తారు. అందులో మొదటిది తయారీ తేదీ. రెండోది ఎక్స్‌పైరీ డేట్‌. మెడిసిన్ తయారు చేయబడిన తేదీని తయారీ తేదీ అని అంటారు. ఇక ఆ ఔషధం తన ప్రభావాన్ని కోల్పోయే తేదీని ఎక్స్‌పైరీ డేట్‌ అని చెబుతారు. అయితే ఎక్స్‌పైరీ డేట్‌ ముగిసిన తర్వాత మెడిసిన్ విషంగా మారతుందని కాదు. ఆ తేదీ తర్వాత నుంచి ఆ మెడిసిన్ మీ శరీరంపై ప్రభావం చూపించలేదని అర్ధం. అంతేకాకుండా వేడి, సూర్యరశ్మి, తేమ, అనేక ఇతర అంశాలు కూడా ఔషధాల శక్తిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిన మెడిసిన్స్ వాడకూడదని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

మీఒకవేళ మీరు అనుకోకుండా గడువు ముగిసిన ఔషధాన్ని వేసుకున్నట్లయితే.. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. Thehealthsite.com నివేదిక ప్రకారం, తయారీదారులు తమ ఔషధాలపై వ్రాసిన ఎక్స్‌పైరీ డేట్‌‌లో మార్జిన్ వ్యవధిని కూడా ఉంచుతారు. ఉదాహరణకు, మీ దగ్గర X అనే మెడిసిన్ ఉందని అనుకుందాం. అది 2 సంవత్సరాలలో ముగుస్తుంది. ఈ డ్రగ్ జనవరి 2021లో తయారు చేయబడింది. అంటే జనవరి 2023తో ఎక్స్‌పైర్ అవుతుంది. అయితే ఔషధానికి సుమారు 6 నెలల మార్జిన్ వ్యవధిని ఉంచడం ద్వారా, సంస్థ దాని గడువు తేదీని జనవరి 2023కు బదులుగా జూన్ 2022 అని ఉంచుతుంది. గడువు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి తెలియకుండా ఆ మెడిసిన్‌ను సేవించినా, అది పెద్దగా హాని కలిగించదు. ఓ నివేదిక ప్రకారం, గడువు ముగిసిన మందులు తీసుకున్న తర్వాత ప్రజలు తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్‌ను ఫేస్ చేసినట్లు సమాచారం.