Vitamin k Benefits: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే.. గుండె, ఎముకల సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?

Vitamin k diet for heart and bones: ఉరుకుల పరుగుల జీవితంలో మనం సరిగా ఆహారపదార్థాలను తీసుకోవడం లేదు. ముఖ్యంగా మనం సరిగా ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యం

Vitamin k Benefits: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే.. గుండె, ఎముకల సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?
Vitamin-E
Follow us

|

Updated on: Jun 02, 2021 | 9:49 PM

Vitamin k diet for heart and bones: ఉరుకుల పరుగుల జీవితంలో మనం సరిగా ఆహారపదార్థాలను తీసుకోవడం లేదు. ముఖ్యంగా మనం సరిగా ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యం బారిన పడుతుంటాం. అయితే.. ముఖ్యమైనచ హృదయ ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి విటమిన్-కె చాలా ముఖ్యం. విటమిన్ కె ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్యలు మీ దరి చేరవని వైద్య నిపుణులు పేర్కొంటుంటారు. అయితే విటమిన్ కె మనకు ఎక్కువగా దొరికే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కివి పండు.. కివి పండులో రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు.. పొటాషియం, ఫోలేట్, విటమిన్-కె కూడా సమృద్ధిగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతిరోజు కివి పండ్లు తినాలని సూచిస్తున్నారు.

బచ్చలి కూర.. ఆకు కూర ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం హృదయ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవడానికి బచ్చలికూడా ఎక్కువగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అవకాడో.. అవకాడో లో కూడా విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని.. ప్రతిరోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

పచ్చి బఠాణి.. పచ్చి బఠాణిలు కూడా ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా ఉపయోగపడతాయి. వీటిలో పలు పోషకాలతో పాటు విటమిన్ కె కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని కూడా మీ డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

దానిమ్మ.. దానిమ్మ పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రక్తం శాతం మెరుగుపడుతుంది. అదే విధంగా విటమిన్ కె కూడా దీనిలో సమృద్ధిగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల హృదయ సంబంధిత సమస్యలు తగ్గి ఎముకలకు బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు.

Also Read:

Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కరోనా టైంలో ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

Simha Kriya Benefits: కరోనా కోరల్లో నుంచి బయటపడానికి శ్వాస పక్రియ మెరుగుపరుచుకోవడానికి మేలు చేసే సింహ ప్రకియ..