Slow Down While Eating: మీరు వేగంగా భోజనం చేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!
ఉరుకులపరుగుల జీవితంలో భోజనాన్ని ఆశ్వాదిస్తూ తినడానికి కూడా సమయం ఉండదు. ఎక్కడ పనులు ఆగిపోతాయేమోనని ఖంగారుతో చాలామంది వేగంగా..
ఉరుకులపరుగుల జీవితంలో భోజనాన్ని ఆశ్వాదిస్తూ తినడానికి కూడా సమయం ఉండదు. ఎక్కడ పనులు ఆగిపోతాయేమోనని ఖంగారుతో చాలామంది వేగంగా భోజనాన్ని పూర్తి చేస్తుంటారు. ఇలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి మన పెద్దవాళ్లు కూడా భోజనాన్ని నెమ్మదిగా తినాలని సలహా ఇస్తుంటారు. మరి వేగంగా భోజనం తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- అవసరం అయిన మోతాదు కంటే ఎక్కువ తింటారు. దీనితో బరువు పెరుగుతారు.
- సరిగ్గా నమలని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి
- కడుపులో ఉబ్బరం వచ్చి క్రమంగా డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
- ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా అనిపిస్తుంది
- వేగంగా భోజనం చేయడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి నెమ్మదిగా నమిలి తినాలని వైద్యులు అంటున్నారు.