సప్తస్వరాలతో ఆయన పలికించిన రాగాలెన్నో… నేటికి ఆయన సంగీతంలో పరవశించేవారు ఎందరో.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బర్త్ డే నేడు..
Ilaiyaraaja: సప్తస్వరాలతో ఆయన పలికించిన రాగాలెన్నో. ఇళయరాజా సృష్టించిన రాగాలు అనితరసాధ్యం. ప్రాంతీయ సంగీతానికి పాశ్చాత్య
Ilaiyaraaja: సప్తస్వరాలతో ఆయన పలికించిన రాగాలెన్నో. ఇళయరాజా సృష్టించిన రాగాలు అనితరసాధ్యం. ప్రాంతీయ సంగీతానికి పాశ్చాత్య సంగీతంతో ఆయన చేసిన ప్రయోగం ఓ సాగర సంగమం. ఆయన తన తరంలోని ఆ సంగీతంతో కొత్త ఆవిష్కరణకు నాంది పలికారు.. సినీ పరిశ్రమలో ఆయన ప్రవేశం ఓ అద్భుతం.. తన బాణీలతో దక్షిణ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సామాన్యుడి నుంచి పండితుడి వరకు.. అందరినీ తన సంగీతంతో పరవశింపజేసారు. దాదాపు స్టార్ హీరోల స్థాయిలో ఆయన పేరు మారుమోగింది. అందుకే ఆయనను కింగ్ ఆఫ్ మెలోడీ, మ్యూజిక్ మ్యాస్ట్రో అని పిలుస్తుంటారు. ఈరోజు (జూన్ 2) ఇళయారాజా పుట్టిన రోజు..
సాహిత్యానికి సంగీతం తోడైతేనే.. అది హృదయాన్ని తాకుతుంది. అప్పుడే మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది. అప్పటివరకు ఎంతో గొప్ప రచయితలున్నా.. ఇళయరాజా రాక తర్వాతే సినిమాల్లో సంగీతానికి ప్రాధాన్యత పెరిగింది. తొలుత శుభకార్యాలకు సంగీతాన్ని అందించే ట్రూప్ లో సభ్యుడిగా కేరీర్ ను ఆరంభించిన ఇళయరాజా.. ఆ తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. ఎంతోమందికి ఆరాధ్య సంగీత దర్శకుడయ్యాడు. 70 వ దశకం నుంచి ప్రారంభమైన ఆయన శకం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన సంతోషం కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. నేటి సీనియర్ హీరోల గతకాలపు హిట్ మూవీల్లో చాలావరకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలకు ఎన్నో హిట్స్ అందించాడు. నాగార్జున ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్.. గీతాంజలిలో సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయో. అందులోని ప్రతీ పాటలో.. ప్రేమికులు తమను తాము చూసుకున్నారు. రుద్రవీణ.. ఆనాటి సమాజపు కట్టుబాట్లపై తిరుగుబావుటా ఎగరేసిన ఈ మూవీ సాంగ్స్.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. గోదావరి నదీ తీరం.. వంశీ సినిమా కథకు ప్రాణం. ఆ కథకు జీవం పోసేది ఇళయరాజా మాత్రమే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్.. ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. వెంకటేశ్ కెరీర్ లో అద్భుతమైన చిత్రం.. ప్రేమ. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకోవాలన్న తపన ఉన్న ఓ కళాకారుడి జీవిత చిత్రమే.. సాగరసంగమం. మణిరత్నం దళపతి మూవీలో ఇళయరాజా అందించిన ట్యూన్స్.. ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిన విషయమే. 2003 లో బీబీసీ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుంచి వచ్చిన పాటల్లో మొదటి పది పాటల్లో దళపతి మూవీ నుంచి అరె చిలకమ్మ సాంగ్.. 4 వ స్థానం దక్కించుకుంది. బాలకృష్ణ భక్తిరస చిత్రం శ్రీరామరాజ్యం మూవీ కోసం ఇళయరాజా కొన్ని గంటల్లోనే ట్యూన్లు సిద్ధం చేశారు. దాదాపు 15 కు పైగా ఉన్న పాటలు. అవును.. సంగీతానికి ఎల్లలు లేవు. ఇప్పటివరకు ఇళయరాజా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో రెండు చిత్రాలు సాగరసంగమం, రుద్రవీణ చిత్రాలు తెలుగు చిత్రాలు కావడం విశేషం. 40 ఏళ్ల సినీ జర్నీలో.. 5 వేల పాటలకు, వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2018 లో పద్మవిభూషణ్ పురస్కారంతో ఇళయరాజాను భారత ప్రభుత్వం గౌరవించింది.
Also Read: Ram Pothineni : షూటింగ్ కు సిద్దమవుతున్న రామ్.. వచ్చే నెలలో సెట్స్ పైకి లింగుస్వామి సినిమా