కేజీఎఫ్ హీరో యష్ గొప్ప మనసు.. సినీ కార్మికులకు రూ.1.5 కోట్లు విరాళం.. ప్రశంసిస్తున్న అభిమానులు.. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం..

గతేడాది కరోనా కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి... ముఖ్యంగా సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిపోయింది. సినిమా షూటింగ్స్, థియేటర్స్

కేజీఎఫ్ హీరో యష్ గొప్ప మనసు.. సినీ కార్మికులకు రూ.1.5 కోట్లు విరాళం.. ప్రశంసిస్తున్న అభిమానులు.. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం..
Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 02, 2021 | 4:23 PM

గతేడాది కరోనా కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి… ముఖ్యంగా సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిపోయింది. సినిమా షూటింగ్స్, థియేటర్స్ మూతపడిపోవడంతో ఎంతో మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయారు. అయితే గత కొన్ని నెలల క్రితం తిరిగి సినిమా షూటింగ్స్, థియేటర్స్ ఓపెన్ కావడంతో.. సినీ కార్మికులు కాస్తా ఊపిరి తీసుకున్నారు. తిరిగి కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోసారి సామాన్యులపై పంజా విసురుతోంది. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తుండడంతో.. అన్ని రంగాలపై ప్రభావం పడింది. ఇప్పటికే సినిమా షూటింగ్స్, థియేటర్స్ మూతపడడంతో మరోసారి సినీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అయితే క్లిష్ట సమయంలో వారిని ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

తాజాగా కన్నడ హీరో యష్ సైతం సినీ కార్మికులకు అండగా నిలిచారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న దాదాపు మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు రూ.1.5 కోట్లు విరాళంగా ఇస్తూన్నట్లు తెలిపాడు. అంటే ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 5000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాడు. ఈ విషయాన్ని యష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇది ఒంటిరిగా పోరాడే సమయం కాదు.. కాబట్టి మా సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు, కార్మికులకు తన వంతు సాయంగా ఈ నగదును అందించనున్నట్లుగా తెలిపారు. ఈ డబ్బు నేరుగా కార్మికుల బ్యాంక్ అకౌంట్లోనే జమ అయ్యేలా ఆయన చర్యలు తీసుకోనున్నారని.. ఈ చిన్న సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు కానీ ఎంతో కొంత ఊరటనిస్తుందని యష్ అన్నారు.

ఇదిలా ఉంటే.. యష్ చేసిన మంచి పనికి ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులు ఆయన చేసిన మంచి పనికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యష్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరోనా కారణంగా.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటున్న సినీ కార్మికులకు స్టార్ హీరోస్ సుదీప్, దర్శన్, ఉపేంద్ర, శివ రాజ్ కుమార్ వంటి వారు సాయాన్ని అందించారు.

ట్వీట్స్…

Yash 1

Also Read: Mani Ratnam Birthday: నాటికి.. నేటికి.. ఆయన సినీ ఇండస్ట్రీలో ఓ నవరత్నం.. ఈ ‘మణి’రత్నం..