Mani Ratnam Birthday: నాటికి.. నేటికి.. సినీ ఇండస్ట్రీలో ఓ నవరత్నం.. ఈ ‘మణి’రత్నం..

మణిరత్నం.. దేశంలోనే అత్యున్నత దర్శకులలో ఒకరు. ఆయన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడ్డాయి.

Mani Ratnam Birthday: నాటికి.. నేటికి.. సినీ ఇండస్ట్రీలో ఓ నవరత్నం.. ఈ 'మణి'రత్నం..
Mani Ratnam
Follow us

|

Updated on: Jun 02, 2021 | 6:13 PM

మణిరత్నం.. దేశంలోనే అత్యున్నత దర్శకులలో ఒకరు. ఆయన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడ్డాయి. సాధారణ ప్రేమికులకు దేశ సమస్యను ముడి పెడితే ఎలా ఉంటుంది. అదే మణిరత్నం సినిమాలు.. పూర్తిగా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ సినిమాలనే ప్రేక్షకులకు అందిస్తాడు మణి. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ఓ సాధారణ ప్రేమజంట ముందుంచుతాడు. వారి ప్రేమతోనే.. ఆ సమస్యను జయిస్తాడు. ఆ సమయంలో అన్ని రకాల ఎమోషన్స్ తో ఆడియన్స్ అటెన్షన్ ను క్యాచ్ చేస్తాడు మణిరత్నం. ఈరోజు మణి రత్నం పుట్టిన రోజు.

దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా భారత చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన అద్భుతమైన దర్శకుడు.. మణిరత్నం. దక్షిణాది నుంచి వచ్చిన మణిరత్నం.. ముందుగా కన్నడలో పల్లవి అనుపల్లవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మౌనరాగం మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. చిన్న కథే అయినా.. తన టేకింగ్ ఎలా ఉంటుందో స్పష్టంగా ఆ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాతో మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ కూడా అయ్యింది. మణిరత్నం తొలిసారి తెలుగులో తీసిన చిత్రం.. గీతాంజలి. నాగార్జున కేరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన ఈ మూవీని.. కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేశారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ మూవీ.. అప్పటి యూత్ లో నాగార్జునకు క్రేజ్ తెచ్చిపెట్టింది. టెర్రరిజం ట్రయాలజీగా పేరొందిన చిత్రాలు.. మణిరత్నం ఖాతాలో చాలానే ఉన్నాయి. రోజా, బొంబాయి, దిల్ సే చిత్రాలు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నాయి.

రజినీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రలో మణి రత్నం తెరకెక్కించిన చిత్రం దళపతి భారీ హిట్ అందుకుంది. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ను వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు మణిరత్నమే. తమిళ రాజకీయాల నేపథ్యంలో నిర్మించిన ఇద్దరు మూవీలో ఐశ్వర్య, మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్, టబూ, మధుబాల వంటి భారీ తారాగణం కనిపిస్తారు. మణిరత్నం అంటేనే ఓ సినీ ఫ్యాక్టరీ. ఆయన ఎంతో మంది హీరోలను, నటులను, దర్శకులను తీర్చిదిద్దాడు. ఆయన నుంచి ఎంతోమంది ప్రముఖులు వెలుగులోకొచ్చారు. ఆస్కార్ అందుకున్న ఏ ఆర్ రెహ్మాన్ ను కూడా పరిచయం చేసింది.. మణిరత్నమే.

Also Read: Nivetha Thomas: మ‌హేష్ సినిమాలో నివేదా అనే మాట‌ల్లో నిజ‌మెంత‌? తెలుసుకుందాం ప‌దండి.