Chanakya Niti: ఈ ఐదు విషయాలు నమ్మదగినవి కావు, అవి ఎప్పుడైనా మనిషిని మోసం చేయగలవని చెప్పిన చాణిక్యుడు
Chanakya Niti: గొప్ప పండితుడు.. చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి అయిన చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రం ప్రసిద్ధిగాంచింది. ఆయన చెప్పిన ప్రతి మాటా అనుభవంతో చెప్పిందే...
Chanakya Niti: గొప్ప పండితుడు.. చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి అయిన చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రం ప్రసిద్ధిగాంచింది. ఆయన చెప్పిన ప్రతి మాటా అనుభవంతో చెప్పిందే. చాణుక్యుడి చెప్పిన మాటలను, నీటి సూత్రాలను ఆచరిస్తే.. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టనష్టాలనైనా ఎదుర్కోవచ్చు.
వ్యక్తి సరైనా మార్గంలో పయనిస్తున్నాడా లేదా అనేది అతను చేసే తప్పుఒప్పులమీద ఆధారపడి ఉంటుంది. ఒక తప్పు ఆ వ్యక్తి జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అందుకనే తాను చేస్తున్న పనిలో తప్పును ప్రతి ఒక్కరూ గుర్తించాలని .. అయితే అలా తప్పు ఏమిటనేది సర్వ్ అసాధారణంగా అందరికీ తెలియదు.. ఆ తప్పుఒప్పులను గురించే నైపుణ్యం జీవిత అనుభవం నుంచి వస్తుంది.
తప్పును గుర్తించలేని ప్రజలు తమ జీవితంలో తప్పులు చేసిన వ్యక్తులను చాలా సార్లు నమ్ముతారు. తమకు తాముగా సమస్యల వలయంలో చిక్కుకుంటారు. అటువంటి వ్యక్తులను ఎలా గురించాలనే విషయం పై ఆచార్య చాణక్య చాణక్య నీతిలో ఐదు విషయాల గురించి చెప్పారు.
ఆచార్య చాణక్య చెప్పిన ప్రకారం, మనం ఎప్పుడూ నదులను నమ్మకూడదు. శిథిలావస్థలో ఉన్న నదులపై నిర్మించిన వంతెనలు ఎప్పటివో తెలియదని అందుకనే వాటిని నమ్మవద్దని చెప్పారు. ఎందుకంటే నది ప్రవాహం ఎప్పుడు వేగంగా పెరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ నదుల ప్రవాహం ఎప్పుడు వంతెనను కూల్చివేస్తుందో తెలియదు.
2. ఏదైనా ఆయుధాలను కలిగి ఉన్న వ్యక్తులను, ఆ ఆయుధాల ఉపయోగించే సాధన తెలియాసిన వ్యక్తిని ఎప్పుడూ నమ్మడం ప్రమాదకరమని తెలిపారు చాణిక్య. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు కనుక అటువంటి వ్యక్తుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
3. పదునైన గోర్లు మరియు కొమ్ములు కలిగిన జంతువులను నమ్మవద్దు. వాటికి ఎప్పుడు కోపం వస్తుందో.. ఎప్పుడు దాడి చేస్తుందో మనకు తెలియదు.. మన ప్రాణాలకు ముప్పుకలిగిస్తాయి. జంతువులు, మంట ఎప్పుడైనా మనకు హాని కలిగిస్తాయి
4. ఆచార్య చాణక్య ప్రకారం, చంచలమైన స్త్రీలను కూడా నమ్మకూడదు. అలాంటి స్త్రీలు తమ మాటలకు కట్టుబడి ఉండలేరు మరియు ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు.
5.న్యాయస్థానం లేదా ప్రభుత్వ సేవతో ముడిపడి ఉన్న వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు. అలాంటి వ్యక్తిని నమ్మి.. మన రహస్యం వారికి చెబితే.. ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితుల్లో వ్యతిరేకంగా మారి ఆ రహస్యాన్ని ఉపయోగించవచ్చు అటువంటి పరిస్థితిలో, మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు.
Also Read: శవపేటిలో ఉన్న మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన స్నేహితులు.. షాక్ తో పరుగేపరుగు